భార్యను కత్తిపీటతో నరికి చంపి భర్త ఆత్మహత్య.. ‘పశ్చిమ’లో దారుణం
జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో ఓ వ్యక్తి భార్యను అతి కిరాతకంగా చంపేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ఓ వృద్దుడు కొంతకాలంగా మతిస్థితిం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం భార్య సత్యవతి(60)తో గొడవపడ్డాడు. ఆవేశానికి గురై వంటగదిలోకి కత్తిపీట తీసుకుని భార్య గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అనంతరం అతడు కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read: ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాసేపటికే అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. Also Read:
By May 06, 2020 at 09:03AM
No comments