Breaking News

మద్యానికి డబ్బుల కోసం వేధించిన భర్త.. తెల్లారేసరికి శవమై


మద్యానికి బానిసై డబ్బలు కోసం వేధిస్తున్న వ్యక్తి భార్య చేతిలో ప్రమాదవశాత్తూ హత్యకు గురైన ఘటన ఒడిశాలోని బ్రహ్మపురం నగరంలో చోటుచేసుకుంది. బజారు జగిలి వీధిలో బనమాలి బెహర(37), సునీతా బెహర దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. భార్యాభర్తలిద్దరూ వీధుల్లో తిరుగుతూ పాలీథిన్లు ఏరుకుని పొట్టపోసుకుంటున్నారు. పేదరికానికి తోడు మద్యానికి బానిసైన బనమాలి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. Also Read: మద్యానికి డబ్బు కోసం భార్యను తరుచూ వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా బనమాలి భార్యతో ఘర్షణ పడి ఆమెపై రుబ్బురోలు పొత్రంతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. సునీత భర్తను అడ్డుకుని కిందకు నెట్టే క్రమంతో రుబ్బురోలు పొత్రం అతడి తలపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం తోపులాటలో పొత్రం బనమాలి తలకు బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. Also Read: దీంతో షాకైన సునీత భర్తను చికిత్స కోసం ఎమ్కేసీజీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తన భర్త ప్రమాదంలో చనిపోయాడని సునీత అందరినీ నమ్మించింది. అయితే బనమాలి శరీరంపై గాయాలు వేరే విధంగా ఉండటంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సునీతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నేరం అంగీకరించింది. దీంతో ఆమెపై హత్య కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేశారు. తండ్రి మరణం, తల్లి జైలుకెళ్లడంతో వారి ఐదుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు. Also Read:


By May 17, 2020 at 11:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-murdered-in-odisha-over-family-disputes/articleshow/75785125.cms

No comments