Breaking News

ప్రేమను తిరస్కరించిన యువతికి సైబర్ వేధింపులు.. ఫోటోలు మార్ఫింగ్ చేసి


ఫేస్‌బుక్‌లో యువతికి అసభ్యకర మెసేజ్‌లు పంపించి వేధిస్తున్న యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన గౌని సంజయ్‌రాజు అనే యువకుడు 2018లో ఓ యువతికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపాడు. ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ తరుచూ ఛాటింగ్ చేసుకునేవారు. సంజయ్ ఆమె నంబర్ తీసుకుని ఫోన్లో మాట్లాడేవాడు. Also Read: కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి ఆ యువతిని సంజయ్ వేధించసాగాడు. రోజూ అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేసేవాడు. తనను కాదన్న ఆమె పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. యువతి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. వాటిని ఆమె ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు పంపించేవాడు. దాన్ని గమనించిన బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: రాచకొండ పోలీస్‌ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలతో ఏసీపీ హరినాథ్ తన టీమ్‌తో రంగంలోకి దిగారు. టెక్నాలజీ సాయంతో వివరాలన్నీ సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. సోషల్‌మీడియాలో పరిచయమయ్యే అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారికి ఫోటోలు, వీడియోలు షేర్ చేసి చిక్కుల్లో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:


By May 03, 2020 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-cyber-harassment-on-woman-over-she-refused-love-proposal-in-hyderabad/articleshow/75513920.cms

No comments