కారు దిగి సెట్ లోకి వస్తుండగానే బాలకృష్ణ.. భయంతో వణికిపోయా: హీరోయిన్ రాశి
ఒకానొక సమయంలో తెలుగుతెరపై స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రాశి. చెన్నైలో జన్మించిన ఈ అందాల రాశి బాలనటిగానే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా స్టార్ హీరోల సరసన నటించింది. దాదాపు 30కి పైగా సినిమాల్లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా నటించిన రాశి.. పలు స్పెషల్ సాంగ్స్ చేసి కూడా ఓ ఊపు ఊపేసింది. పెళ్లి చేసుకొని కొంతకాలంగా సినిమాలకు దూరమై తిరిగి ఇప్పుడు కెమెరా వంక చూస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ నందమూరి నటసింహం బాలకృష్ణపై కామెంట్స్ చేసింది. బాలకృష్ణతో బాలనటిగా, అదేవిధంగా ఆయన సరసన హీరోయిన్‌గా నటించిన అనుభవం రాశికి ఉంది. ఈ సందర్భంగా తాను బాలనటిగా బాలకృష్ణతో నటించిన ‘బాలగోపాలం’ సినిమా విశేషాలను తెలుపుతూ ఆయనతోనే హీరోయిన్ ఛాన్స్ వచ్చాక ఏం జరిగింది? బాలయ్య బాబు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాలను రాశి చెప్పుకొచ్చింది. ‘బాలగోపాలం’ సినిమాలో తనతో పాటు నందమూరి కల్యాణ్ రామ్ కూడా నటించారని చెప్పింది రాశి. అయితే ఆ తర్వాత బాలయ్య బాబుతో మళ్లీ ‘కృష్ణబాబు’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడంతో ఓకే చెప్పాను గానీ.. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా భయమేసిందని రాశి తెలిపింది. బాలయ్య నన్ను ఎలా యాక్సప్ట్ చేస్తారో అనుకున్నానని, కానీ అలా జరగలేదని ఆమె చెప్పుకొచ్చింది. ‘బాలగోపాలం’ సినిమా చేసేటపుడు చిన్నగా ఉన్నాను. కాబట్టి పర్వాలేదు. కానీ అదే బాలకృష్ణతో ‘కృష్ణబాబు’ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నా. ఇదే తనలో భయానికి కారణమైందని రాశి పేర్కొంది. ఆ భయంతోనే కారు దిగి సెట్‌కు వెళ్తుండగా అక్కడ బాలయ్య కూర్చొని ఉన్నారని, తాను విష్ చేసే లోపే ఎలా ఉన్నావ్.. ఇలారా అంటూ ఆయన పలకరించడంతో భయం పోయి వెంటనే కూల్ అయ్యానని తెలుపుతూ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది రాశి. బాలయ్య చాలా నైస్ పర్సన్ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తోంది రాశి. Also Read:
By May 08, 2020 at 09:21AM
No comments