Breaking News

చిరంజీవి చొరవ.. టాలీవుడ్ పెద్దలంతా కలిసి.. పూరి జగన్నాథ్ కామెంట్స్


కరోనా విలయతాండవంలో సినీ పరిశ్రమ బాగా నష్టపోయింది. దాదాపు రెండు నెలల పాటు షూటింగ్స్ నిలిచిపోవడంతో సినీ కార్మికులు ఆర్ధిక స్థితిగతులు తారుమారయ్యాయి. దినసరి కూలీలకు పని దొరకక ఆకలితో అలమటించాడు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ఆధ్వరంలో ఏర్పాటు చేసిన 'కరోనా క్రైసిస్ చారిటీ' సినీ కార్మికులకు అండగా నిలిచి ధైర్యం చెప్పింది. అదేవిధంగా నాలుగో దశ లాక్‌డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు సడలింపులతో కూడిన మినహాయింపు ఇవ్వడంతో.. సినీ రంగం తరఫున మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పెద్దలంతా కలిసి తమ తమ షూటింగ్స్‌కి కూడా అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ని అభ్యర్థించారు. ఈ మేరకు సినిమా షూటింగ్స్ పున:ప్రారంభించుకోవడానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కొద్దిమందితో సామాజిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా షూటింగ్‌లు చేసుకోవచ్చని తెలిపారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని.. ఆ తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని కేసీఆర్ చెప్పారు. Also Read: కరోనా కల్లోలంలో కార్మికులను ఆదుకోవడంతో పాటు చిత్రసీమలో సమస్యలు, షూటింగ్స్ పున:ప్రారంభించడం, థియేటర్లు రీఓపెనింగ్ వంటి వాటిపై చొరవ తీసుకున్న వారిలో ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకు స్పెషల్ థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు డైరెక్టర్ . ''చిరంజీవి సర్.. మీరు తీసుకున్న చొరవ చాలా గొప్పది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇండస్ట్రీలోని పెద్దలందరూ కలిసి సినిమా భవిష్యత్తు కోసం తపించడం హర్షించదగ్గ విషయం. నేను కూడా త్వరలోనే ముంబై నుంచి వస్తాను.. వచ్చాక పూర్తి స్థాయిలో మీతోపాటే ఉంటాను. లవ్యూ ఆల్'' అని పేరొన్నారు పూరి. షూటింగ్స్ ప్రారంభమైన వెంటనే కొరటాల శివతో చేస్తున్న 'ఆచార్య' సెట్స్ పైకి వచ్చేస్తారు చిరంజీవి. అలాగే విజయ్ దేవరకొండతో చేస్తున్న కొత్త సినిమా షెడ్యూల్స్ ప్రారంభిస్తారు పూరిజగన్నాథ్. క్రమక్రమంగా మిగిలిన అన్ని సినిమాలు కూడా సెట్స్ పైకి వచ్చేస్తాయి.


By May 23, 2020 at 08:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/puri-jagannadh-tweet-on-chiranjeevi-motivations-on-corona-crisis/articleshow/75909435.cms

No comments