Breaking News

అవకాశాల కోసం లొంగిపోయి..! కాస్టింగ్ కౌచ్‌పై హాట్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్


సినీ పరిశ్రమలో అనే భూతం రాజ్యమేలుతుందని, అవకాశాల పేరుతో నటీమణులను లైంగికంగా వాడుకుంటున్నారని ఇప్పటికే ఎందరో సినీ తారలు వాపోయారు. మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటి ఉద్యమాల ప్రభావంతో చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక దాడుల పట్ల స్పందించారు. సినిమా అవకాశం దక్కాలంటే మంచమెక్కాల్సిందే అని కొందరు నటీమణులు బాహాటంగా కామెంట్స్ చేశారు. దీంతో ఈ అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కొందరు నటీమణులు మాత్రం సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశాన్ని తోసిపుచ్చుతున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో ఉందని, అయినా లైంగిక లొంగుబాటు అనేది వ్యక్తి ఇష్టాయిష్టాలకు సంబంధించిందని కొందరు నటీమణులు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా కాస్టింగ్ కౌచ్ విషయమై స్పందించిన హాట్ బ్యూటీ .. కాస్టింగ్ కౌచ్‌ అనేది బలవంతపు చర్య కాదని చెప్పుకొచ్చింది. మహిళలను లైంగికంగా దోచుకోవడమేని కేవలం దక్షిణాది, ఉత్తరాది చిత్రసీమలోనే కాదు.. ప్రపంచం మొత్తం అన్ని రంగాల్లోనూ ఉందని తెలిపింది. కాకపోతే తప్పు చేయాలా? వద్దా? అనేది మన మీదే ఆధారపడి ఉంటుందని, అవతలి వ్యక్తి బలవంతం చేశాడని లొంగిపోవడం ఆ తర్వాత దాన్ని బయటపెడుతూ రాద్ధాంతం చేయడం సరికాదంటూ సంచలన కామెంట్స్ చేసింది ఆదా శర్మ. అవకాశం రాకున్నా ఫర్వాలేదు గానీ ముఖం మీదే కమిట్మెంట్ లాంటి అంశాలకు నో చెప్పేస్తే ఇలాంటి గోల ఉండదనే కోణంలో ఆమె మాట్లాడటం గమనార్హం. టాలీవుడ్ టు బాలీవుడ్ అంతా సుపరిచితమైన హాట్ బ్యూటీ ఆదా శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం అందరితో టచ్‌లో ఉంటుంది. అందాలతో కిక్కిస్తూ నెటిజన్లను మైమరిపిస్తుండటం ఈ హార్ట్ అటాక్ బ్యూటీ స్పెషాలిటీ. తెలుగులో ‘‘హార్ట్ అటాక్, S/O సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’’ లాంటి సినిమాల్లో ఆమె నటించింది. అన్నట్టు మరో విషయం ఈ రోజే (మే 11) ఆదా శర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు 'సమయం తెలుగు' పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. Also Read:


By May 11, 2020 at 10:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/adah-sharma-sensational-comments-on-casting-couch/articleshow/75668515.cms

No comments