హైట్ చెక్.. మహేష్ బాబుతో పోటీపడుతున్న గౌతమ్.. సూపర్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్
లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమై సోషల్ మీడియా ద్వారా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ సమయం దొరికితే చాలు భార్యాపిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసే సూపర్ స్టార్ .. ఈ క్వారంటైన్ సమయాన్ని ఫుల్లుగా సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా రోజులు బ్రేక్ దొరకడంతో తన తనయుడు గౌతమ్, కుమార్తె సితారతో సరదాగా గడుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బాబు.. తన తనయుడు గౌతమ్‌తో హైట్ చెక్ చేసుకుంటున్న వీడియోను తన ఇన్స్‌స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇందులో గౌతమ్, మహేష్ బాబు ఎదురుగా నిల్చుని సరదాగా ఎత్తు కొలుచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. గౌతమ్‌ను ఇలా చూసిన వారందరూ అప్పుడే తండ్రి మహేష్ అంత ఎత్తుకు ఎదిగిపోయాడుగా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ‘హైట్ చెక్!! హి ఈజ్ టాల్, లాక్‌డౌన్‌లో కొంచెం ఫన్నీగా..’ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ జోడించి మహేష్ బాబు షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: మహేష్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘సరిలేరునీకెవ్వరు’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆయన, ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో మహేష్ భాగస్వామ్యం కూడా ఉండనుందని, నమ్రత దగ్గరుండి అన్నీ చేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు తెలియనున్నాయి. దీని తర్వాత మహేశ్-రాజమౌళి కాంబో మరో భారీ మూవీ రానుంది.
By May 23, 2020 at 12:12PM
No comments