కరెంట్ షాక్‌తో గ్రామ వాలంటీరు మృతి... బిడ్డ పుట్టిన నెలరోజులకే విషాదం
జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ వైపునకు వెళ్తున్న పశువులను అదిలించే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల క్రితమే అతడికి పండంటి పాపకు తండ్రయిన అతడు.. ఆ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ ఇంటి దీపం ఆరిపోయిందన్న పిడుగులాంటి వార్త విని ఊరంతా తేరుకోలేకపోతోంది. Also Read: కురుపాం మండలం జరడ పంచాయతీ నెమలిమానుగూడ గ్రామానికి చెందిన హిమరిక ప్రేమ్‌కుమార్(25) బీటెక్ చదివాడు. ప్రభుత్వ కొలువులకు ప్రయత్నిస్తూనే గ్రామ వాలంటీరుగా సేవలందిస్తున్నాడు. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అతడికి పశువులు ట్రాన్స్‌ఫార్మర్ వైపు వెళ్లడాన్ని గమనించాడు. వాటిని రక్షించే క్రమంలో తాను ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరికి వెళ్లడంతో షాక్‌కు గురయ్యాడు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పెద్దగా మంటలు, భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందోనన్న ఆందోళనతో స్థానికులు బయటికి వచ్చి చూడగా ప్రేమ్‌కుమార్ షాక్‌తో గిలగిలా కొట్టుకుంటూ కనిపించాడు. Also Read: దీంతో స్థానికులు అతడిని వెంటనే నీలకంఠాపురం పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం భద్రగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణం విడిచాడు. ఆదుకునే వయసులో మమ్మల్ని వదిలివెళ్లిపోయావా అంటూ తల్లిదండ్రులు, భార్య బోరున విలపిస్తున్నారు. అప్పటివరకు తమతో కలసిమెలసి ఉన్న యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. Also Read:
By May 17, 2020 at 08:08AM
No comments