గతంలో ఎప్పుడూ ఇలాంటి దాఖలాలు లేవు.. ముఖ్యమంత్రిపై పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/75933536/photo-75933536.jpg)
రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే అటు రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారు. వైసీపీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనను కొనియాడుతున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్ సీఎం కావడమే లక్ష్యంగా రాజకీయ విప్లవం కొనసాగించిన ఆయన.. వైసీపీ అధికారం లోకి వచ్చాక అవకాశం దొరికిన ప్రతిసారి జగన్ పాలనపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దాదాపు అన్ని హామీలను తీర్చేసిన వన్ మెన్ ఆర్మీ వైఎస్ జగన్ అని అన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనది మాత్రమే అని కొనియాడారు. అంతేకాదు ఇటీవల జరిగిన విశాఖ గ్యాస్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆయన కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించారని, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇంత పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని చెబుతూ జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో చాలాసార్లు మీడియా ముఖంగా జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న పోసాని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆఫర్ కూడా వచ్చిందని, కానీ తానే తిరస్కరించానని అప్పట్లో వెల్లడించారు. వైఎస్ పట్ల ఉన్న అభిమానంతో ఆ పార్టీ విజయాన్ని మాత్రమే కోరుకుంటూ ఏ పదవీ ఆశించలేదని అన్నారు. అందరిలా ఎగబడి పదవులు తీసుకునే అలవాటు తనకు లేదని చెప్పి అప్పట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు . Also Read: ఇక పోసాని సినీ కెరీర్ విషయానికొస్తే.. దాదాపు 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పని చేసిన ఆయన, కొన్ని సినిమాలకు దర్శకుడిగా కూడా పని చేశారు. అంతేకాదు వెండితెరపై విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఎదుటి వాళ్ళు ఎవరనే విషయాన్ని పక్కనబెట్టి రాజా.. రాజా అంటూ ఆయన సంబోధించే తీరుకు బాగా అట్రాక్ట్ అయ్యారు జనం.
By May 24, 2020 at 08:25AM
No comments