Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు పోర్న్ స్టార్ స్వాతి నాయుడు


తెలుగు పోర్న్ స్టార్, యూట్యూబ్ సంచలనం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. డాక్టర్ సమరం సుఖ సంసారం ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి నాయుడు యూట్యూబ్‌లో న్యూడ్ వీడియోలతో పాపులర్ అయ్యారు. తనకు సన్నిలియోనిలా పోర్న్ స్టార్ కావడం ఇష్టం అని బోల్డ్ కామెంట్స్ చేసిన స్వాతి నాయుడు.. ఆమె అనుకున్నట్టుగానే పలు శృంగారభరిత చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ఇక పలు బ్లూ ఫిల్మ్స్‌లో కూడా నటించి తెలుగు పోర్న్ స్టార్‌ అనిపించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది. సినిమాల్లో ప్రయత్నాలు విఫలం కావడంతో తన కెరియర్‌ను ఈ వైపుగానే మల్చుకున్న స్వాతి నాయుడు అవినాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. 2019 ఫిబ్రవరి 23న విజయవాడలోని టింబర్ మర్చంట్ ఛాంబర్‌లో వీరి వివాహం వైభవంగా సాగింది. గతకొన్నాళ్లుగా తన స్నేహితుడు అవినాష్‌తో సహజీవనం చేసిన స్వాతి నాయుడు తిరిగి అతడ్నే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేసిన స్వాతి నాయుడు.. తన గతం ఎలా గడిచినప్పటికీ మాతృత్వంలోని అనుభూతి ఇన్నాళ్లుకు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. మే 25న డెలివరీ డేట్ ఇచ్చినట్టు తెలిపిన స్వాతి నాయుడు ఆ డేట్‌కి ముందుగానే మే 10న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ‘నా బేబీ కోసం నేను తొమ్మది నెలలు ఆగాలా? అని అనిపిస్తుంది. కాస్త త్వరగా పుడితే బాగుండనిపిస్తుంది’ అని మాతృత్వంలో ఉన్న మాధురానుభూతిని పొందిన స్వాతి నాయుడు తాను అనుకున్నట్టుగానే కాస్త ముందుగానే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తాను బేబీని కన్న తరువాత కూడా తన కెరియర్‌ని కంటిన్యూ చేస్తానని.. ఓ రెండు మూడు నెలలు గ్యాప్ తరువాత ఫిట్ నెస్‌పై శ్రద్ధ పెట్టి.. వీడియోలు చేస్తానన్నారు స్వాతి నాయుడు. మనకు కావాలన్నప్పుడు ఎలాంటి అవకాశాలైనా రావు. కాబట్టి.. ఉన్నప్పుడే చేయాలి. ఎప్పుడైనా షూటింగ్స్ చేయడానికి నేను రెడీ. తల్లిని అయ్యాను కాబట్టి షూటింగ్స్ చేయకూడదనే రూల్ ఏమీ లేదు.. నా భర్తకు పిల్లలు అంటే చాలా ఇష్టం పెళ్లైనప్పటి నుంచి పిల్లలు కావాలని అడుగుతుండేవాడు.. అతని ఇష్టమే నా ఇష్టం. కాని బిడ్డను కని నా భర్త చేతుల్లో పెడతా. అతనే నన్ను చూసుకున్నట్టే నా బిడ్డను చూసుకుంటారు. దానికి నా భర్త అవినాష్ ప్రిపేర్‌గా ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చారు స్వాతి నాయుడు.


By May 12, 2020 at 10:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/youtube-sensation-and-telugu-porn-star-swathi-naidu-blessed-with-baby/articleshow/75688296.cms

No comments