Breaking News

వివాహితతో అక్రమ సంబంధం.. కర్నూలులో యువకుడి దారుణహత్య


ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. జిల్లాలోని దేవనకొండ మండలం కుంకనూరు గ్రామంలో ఓ యువకుడిని దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: మృతుడిని గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఓ వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ హత్యకు పాల్పడింది మహిళ బంధువులా? లేక ఇతరులా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యువకుడిని ఇక్కడే హత్య చేశారా? లేవ వేరే ప్రాంతంలో చంపి ఇక్కడ పడేశారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 07, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-brutally-murdered-in-kurnool-district/articleshow/75590742.cms

No comments