అలసి సొలసి సూట్‌కేస్‌పై చిన్నారి.. గుండెల్ని పిండేసే ఆ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్
లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా వలస కూలీలు ఎదుర్కొంటున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఓ మహిళ నడవలేక అవస్థలు పడుతున్న తన కొడుకును చక్రాల సూట్‌కేసుపై పడుకోబెట్టి లాక్కెళ్తున్న వీడియో చూసిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతోంది. దీనిపై మీడియాలో వస్తున్న కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) సుమోటాగా స్వీకరించి, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆగ్రా జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీచేసింది. లాక్‌డౌన్ సమయంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచలేకుకండా పనిచేస్తున్నాయని, కానీ, వలస కూలీలు కాలినడకన వెళ్తూ పిల్లలు, మహిళలు అనేక ఇబ్బందులు పడతున్నారని, ఇది చాలా బాధకరమని వ్యాఖ్యానించింది. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉంటే, బాధితులు, ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుందని, ఈ సంఘటన మానవ హక్కుల ఉల్లంఘనతో సమానమని, తమ జోక్యం అవసరమని ఎన్‌హెచ్ఆర్సీ పేర్కొంది. ఈ అంశంపై పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆగ్రా జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీచేసిన జాతీయ మానవహక్కుల కమిషన్.. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజల కష్టాల గురించి మీడియాలో కథనాలు అనేకం తమ దృష్టికి వచ్చాయని, ప్రస్తుత ఘటన మానవ హక్కుల ఉల్లంఘనకు అంశమని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయడానికి జోక్యం చేసుకోవలసి వచ్చిందని తెలిపింది. పెద్ద మొత్తంలో, ముఖ్యంగా సమాజంలోని పేద వర్గాలు అనేక ఇబ్బందు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు వెళ్లడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ఈ ఘటనతోపాటు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడక వెళ్తున్న ఓ గర్భిణి మార్గమధ్యంలో బిడ్డను ప్రసవించిన ఘటనను కూడా ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ మహిళ కొన్నాళ్ల కిందట పంజాబ్‌కు వలస వెళ్లింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో తన సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి.. దాన్ని లాగుకుంటూ.. 800 కిలోమీటర్ల మేర నడిచింది. సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి లాగుతున్న దృశ్యాలను ఆగ్రా హైవేపై మీడియా తమ కెమెరాల్లో బంధించింది. సూట్‌కేసుతో పాటు బిడ్డను లాగిలాగి ఆ మహిళ అలసిపోయింది.. నీరసంగా ఉంది. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆ మహిళకు మాట రాలేదు.
By May 16, 2020 at 11:14AM
No comments