ఏలూరులో దారుణం.. మద్యం మత్తులో ప్రియుడి నాలుక కొరికిన యువతి
ఫుల్ గా మద్యం సేవించింది. ఆ మత్తులో ఏం చేస్తుందో తనకే తెలియకుండా పోయింది. అందరూ చూస్తుండగానే.. ప్రియుడి నాలుకను అంగుళం మేర కొరికేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో వ్యక్తిని ముద్దులతో ముంచెత్తింది. అంతేకాదు అతడ్ని కూడా కొరికి గాయాలపాలు చేసింది. అందర్నీ షాక్‌కు గురి చేస్తున్న ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ ఓ వివాహిత భర్తను వదిలేసి నివసిస్తోంది. ఈ క్రమంలో అక్కడున్న మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం మద్యం కొనుగోలు చేసి తెచ్చుకుంది. ఫూటుగా మద్యం సేవించింది. మద్యం మత్తులో కాలనీలోనే బహిరంగంగానే ప్రియుడ్ని ముద్దులతో ముంచెత్తింది. ఇదంతా చూస్తున్న స్థానికులు తాగిన మత్తులోనే అలా ప్రవర్తిస్తుందని అనుకున్నారు. అంతలోనే ఆమె ప్రియుడి నాలుకను ఒక్కసారిగా కొరికేసింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఆ తర్వాత ప్రియుడు బంధువైన మరో వ్యక్తిపై ఆమె ముద్దులతో దాడి చేసింది. అతడి పెదాలపై బుగ్గలపై నాలుకను కొరికి గాయపరిచింది. దీంతో వెంటనే అతడు ఆమె బారి నుంచి తప్పించుకొని నరసాపురం ప్రదాన కాలువలో దూకి బాధ తట్టుకోలేక నీళ్లలో తడుస్తూ కాస్త సేద తీరాడు. ఇలా ఇద్దర్నీ మద్యం మత్తులో కొరికిన వివాహిత తీవ్ర గాయాలు పాలుచేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా మద్యం మత్తులోనే ఉన్నారని ... ఫుల్‌గా తాగారని స్థానికులు చెబుతున్నారు.
By May 10, 2020 at 07:27AM
No comments