అత్త తిట్టిందని కోడలు ఆత్మహత్య.. పటాన్‌చెరులో విషాదం
అత్త మందలించిందన్న కోపంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం కంచర్ల గ్రామానికి చెందిన శివాని(25)కి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన హనుమంతుతో 2014లో వివాహమైంది. వీరు బతుకుదెరువు కోసం కొంతకాలం క్రితం పటాన్‌చెరులోని గోకుల్‌నగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. హనుమంతు తాపీమేస్త్రీగా పనిచేస్తుండగా.. అతని కింద పని చేసే వారికి శివాని రోజూ భోజనం వండి పెట్టేది. Also Read: నెలరోజుల క్రితం హనుమంతు తల్లి కూడా పటాన్‌చెరుకు వచ్చి వారి వద్దే ఉంటోంది. శివానీ దంపతులు పనివారితో పాటే తాము కూడా అదే భోజనం తినేవారు. అయితే పనివారికి పెట్టే భోజనం తనకు వద్దని, వేరుగా వండాలని శివానీని అత్త చెప్పింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఈ నెల 9న హనుమంతు పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగివచ్చాడు. గదిలోకి వెళ్లి చూడగా శివాని ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. Also Read:
By May 11, 2020 at 11:01AM
No comments