Breaking News

ముగ్గురి ప్రాణం తీసిన రోడ్డుప్రమాదం.. వరంగల్‌లో విషాద ఘటన


రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. సొంత పనుల నిమిత్తం ఒకే బైక్‌పై బయలుదేరిన ముగ్గురిని వ్యాను రూపంలో మృతువు కబళించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మైలారం శివారులో వరంగల్‌- ఖమ్మం జాతీయ రహదారిపై మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. Also Read: ఆర్‌ఆండ్‌ఆర్‌ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని సుభాష్‌ తండాకు చెందిన బాదావత్‌ దేవేందర్‌(37), బాదావత్‌ సురేందర్‌(27), పర్వతగిరి మండలం అన్నారం శివారు భంగ్యా తండాకు చెందిన భూక్య బాలాజీ(27)తో కలిసి మంగళవారం మధ్యాహ్నం బైక్‌పై వరంగల్‌ వైపు వెళ్తున్నారు. ఖమ్మం వైపు వెళ్తున్న మినీ డీసీఎం వీరిని ఎదురుగా ఢీకొంది. దేవేందర్‌ సంఘటనా స్థలంలోనే చనిపోగా.. బాలాజీ, సురేందర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. Also Read: దేవేందర్‌, సురేందర్‌ వరుసకు అన్నదమ్ములవుతారు. దేవేందర్‌కు బాలాజీ బావ. సురేందర్‌ ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రమాద సమాచారం తెలియగానే ఆ యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. చేతికందొచ్చిన కొడుకులు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండటాన్ని వార్త తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు వర్ధన్నపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By May 13, 2020 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/dcmdcm-van-hit-bike-in-warangal-rutal-district-3-died/articleshow/75707603.cms

No comments