Breaking News

నాకైతే అలాంటి అలవాటు లేదు.. నిర్మాతలు నా దగ్గరకు వస్తే! ఇస్మార్ట్ బ్యూటీ ఘాటు రియాక్షన్


టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త అందాల తాకిడి ఎక్కువైపోయింది. హీరోయిన్లతో రొమాన్స్ పండించడంలో నూతన మార్గాలను అన్వేషిస్తున్నారు దర్శకనిర్మాతలు. కొందరు హాట్ హీరోయిన్స్ వరుస ఛాన్సులు పట్టేస్తూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళ రేంజ్ పెరిగిందని, అప్పుడే రెమ్మ్యూనరేషన్ విషయంలో డిమాండ్స్ చేస్తున్నారని కొందరు హీరోయిన్లపై రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అలాంటి రూమర్స్ బారిన పడిన హీరోయిన్లలో ఒకరే ఇస్మార్ట్ బ్యూటీ . అయితే ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన ఆమె తనపై వస్తున్న రూమర్స్ పట్ల మరోసారి ఘాటుగా రియాక్ట్ అయింది. దర్శకులు, నిర్మాతలు ఎవరైనా నన్ను సంప్రదిస్తే.. ముందు కథ వింటానని, కథ ఆసక్తిగా లేకపోతే డబ్బుల గురించి అస్సలు డిస్కస్‌ చేయనని నభా నటేష్ పేర్కొంది. ఏ భాషలో అయినా సరే! నిర్మాతలెవరూ ‘పారితోషికం ఎంత?’ అని నా దగ్గరకు రారు. నాకు తెలిసి, ఈ మధ్య ఎవరినీ నేను ఎక్కువ డబ్బులు అడగలేదు. తెలుగు సినిమాకు నేనెంత తీసుకుంటున్నాననేది నా సక్సెస్‌, మార్కెట్‌ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి చూడడం నాకు అలవాటు లేదని ఘాటుగా రియాక్ట్ అయింది. సినిమాపై ఆసక్తి కలగాలే కానీ తానే ముందడుగు వేస్తానని, కన్నడ సినిమాల్లో నటించేందుకు తానెప్పుడూ సిద్దమే అని చెప్పింది. పాత్ర మంచిదైతే ఏ భాష అయినా చేస్తా అని నభా చెప్పుకొచ్చింది. Also Read: ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా నటేష్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో కెరీర్ టర్న్ చేసుకుంది. మోడ్రన్ అమ్మాయిగా రెచ్చిపోయి అందాల విందు చేసింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి. రవితేజతో ‘డిస్కో రాజా’ సినిమా చేసిన ఆమె.. ప్రస్తుతం సాయి తేజ్‌ సరసన ‘సోలో బతుకే సో బెటర్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరసన ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాల్లో నటిస్తోంది.


By May 18, 2020 at 09:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nabha-natesh-once-again-reacted-on-her-remuneration-issue/articleshow/75797534.cms

No comments