Breaking News

ఓ సారి ఫ్రెండ్ కోసం బస్టాండ్ వెళ్తే.. నిజమే అలా జరిగింది.. ఓపెన్‌గా చెప్పిన శృతి హాసన్


కమల్ హాసన్ కూతురుగా వెండితెరకు పరిచయమైన సౌత్ ఇండియన్ తెరపై అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. అందం, అందుకు తగ్గ అభినయం ఆమెకు వరుస అవకాశాలు తెచ్చిపెట్టాయి. తెలుగులో చివరగా 'కాటమరాయుడు' సినిమాలో నటించి ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శృతి హాసన్.. తిరిగి ఈ మధ్యకాలంలోనే కొన్ని సినిమాలు ఓకే చేసి కెమెరా ముందుకొచ్చింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఆమె సోషల్ మీడియా వేదికగా సరదాగా అభిమానులతో ముచ్చటిస్తూ తన లైఫ్ సీక్రెట్స్ చెప్పేసింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పాటలు, కవిత్వాలు రాయడం అంటే ఇష్టం అని పేర్కొన్న ఆమె ప్రొడక్షన్‌ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చింది. తాను సాధించాలనుకుంటున్న ఘనతలెన్నో ఉన్నాయని చెబుతూనే వాటన్నింటికీ ఇంకా చాలా టైమ్ ఉందంటూ తనదైన కోణంలో స్పందించింది శృతి హాసన్. తాను మంచి తల్లిని కావాలనుకుంటున్నానని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. Also Read: ప్రస్తుతం తనకు తానుగా స్వీయ నిర్బంధంలో ఉన్నానని, లాక్‌డౌన్ పూర్తికాగానే పరిస్థితులు చక్కబడితే షూటింగ్స్‌లో పాల్గొంటానని చెప్పింది. ఇకపోతే తండ్రి కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.. తనను గాని, చెల్లిని గాని నాన్న ఎప్పుడూ కొట్టలేదని తెలిపింది. ఒకసారి తనో తప్పు చేస్తే కూడా ఆయన ‘అయామ్‌ సో డిజప్పాయింట్’ అన్నారు తప్ప అస్సలు తిట్టలేదని చెప్పింది శృతి హాసన్. ఎర్లీ 2000లో చెన్నైకి ఫ్రెండ్‌ వచ్చినప్పుడు బస్టాండ్ వెళ్లానని, అయితే అక్కడ ఎవరో సుసుకు వెళితే అందులో జారిపడ్డానని, అది నిజమే అని ఓపెన్‌గా చెప్పేసి ఆశ్చర్యపరిచింది శృతి. ఆ సమయంలో తన చెల్లి హెల్ప్‌ చేయకపోగా నన్ను చూసి నవ్వింది తెలిపింది. కాగా బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నారా? అని ఓ నెటిజన్ అడగగా టాటా బైబై! అంటూ ఆ ప్రశ్నను దాటేసింది శృతి. శృతి హాసన్ ప్రస్తుతం రవితేజ సరసన 'క్రాక్' సినిమాలో నటిస్తోంది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బీ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.


By May 11, 2020 at 12:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shruti-haasan-reacts-on-bad-incident-occured-in-her-life/articleshow/75670433.cms

No comments