Breaking News

రెండేళ్ల ప్రేమ... పెళ్లయిన రెండ్రోజులకే నవవధువు ఆత్మహత్య


పెద్దలను ఒప్పించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న ఓ యువతి మూడు రోజుల వ్యవధిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని జిల్లాలో జరిగింది. వేలూర్‌ జిల్లా కేవీకుప్పం వడంగంతాంగళ్‌ అంజుతంనగర్‌కు చెందిన ఓ యువతి(20), అదే ప్రాంతానికి చెందిన శంకర్ అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో ఏప్రిల్ 29న సన్నిహితుల మధ్య నిరాబండరంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. Also Read: అయితే ఏం జరిగిందో తెలీదు గాని శుక్రవారం యువతి గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. దీంతో ఆమెను వెంటనే కేవీకుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు మృతదేహాన్ని గుడియాత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:


By May 03, 2020 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-woman-commits-suicide-in-tamil-nadu/articleshow/75513708.cms

No comments