Breaking News

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు.. భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక


కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి పలు దేశాల్లో లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. కేవలం లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించడం వల్లే వైరస్‌ను నియంత్రించగలమని (డబ్ల్యూహెచ్ఓ) సహ నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వల్ల ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో మిహాయింపులు, సడలింపులు చేస్తున్నారు. ఆంక్షల సడలింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని, భారత్‌, అమెరికా‌ లాంటి దేశాలు ఆంక్షలు సడలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయిని హెచ్చరించింది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు ఆంక్షలు సడలించవద్దని, ఈ విషయంలో బాగా ఆలోచించుకోవాలని సూచించింది. పలు దేశాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తోన్న విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయా దేశాలకు పలు హెచ్చరికలు చేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం, లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. భారత్‌తో పాటు అమెరికా‌ లాంటి దేశాలు ఒకవేళ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని చెప్పారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించవద్దని పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్‌ను‌ కట్టడి చేయడానికి ప్రస్తుతం పలు దేశాలు తీసుకుంటున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో నిబంధనలు ఎత్తివేడం వల్ల మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఆయా దేశాలు లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే విషయంపై బాగా ఆలోచించుకోవాలని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని, ఇలాంటి పరిస్థితులు ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో అధికంగా ఉన్నాయన్నారు.


By May 02, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/who-warns-like-india-and-other-countries-must-ease-lockdown-restrictions-slowly/articleshow/75502010.cms

No comments