కారు డ్రైవర్‌కు లైంగిక వేధింపులు.. వరంగల్‌లో హిజ్రా దారుణహత్య
గతంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రోజూ హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దాడులు... ఇలా రోజూ కొన్నివేల కేసులు నమోదయ్యేవి. అయితే కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో క్రైమ్ భారీగా తగ్గింది. దీనిపై పోలీసులు, ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశారు. అయితే లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇవ్వడం, మద్యం దుకాణాలు తెరవడంతో మళ్లీ నేరాల పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అనేకచోట్ల హత్యలు, అత్యాచారాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో రెండు హత్యలు జరగడం కలకలం రేపింది. తాజాగా అర్బన్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్శిటీ సమీపంలో హరిణి అనే ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. Also Read: బుధవారం ఉదయం హరిణి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హిజ్రా హత్య వెనుక సురేశ్ అనే కారు డ్రైవర్ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హరిణి కొంతకాలంగా సురేశ్‌ను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తనతో సహజీవనం చేయాలని ఆమె చేస్తే ఒత్తిడి భరించలేకే అతడు హరిణిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By May 14, 2020 at 07:57AM
No comments