టీడీపీ నేతపై రేప్ కేసు.. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మైనర్ బాలికపై టీడీపీ నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విన్నమాల గ్రామానికి చెందిన దార్ల మోహన్ పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: మరో ఘటనలో బాలికను మాయమాటలతో లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నాయుడుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపై తుమ్మూరుకు చెందిన సగుటూరు వెంకటేశ్ అనే యువకుడు కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఇటీవల బాలికను బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమె నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంకటేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. Also Read:
By May 17, 2020 at 08:25AM
No comments