క్వారంటైన్‌లో ఉంచిన అధికారులు.. డిప్రెషన్‌తో యువకుడి ఆత్మహత్య
తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ నమోదవుతున్న వందలాది కేసులతో అక్కడ కరోనా బాధితుల సంఖ్య 7వేలు దాటేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అనుమానితులకు పరీక్షలు చేసి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఇలాగే కరోనా సోకిందన్న అనుమానంతో క్వారంటైన్‌కు తరలించిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తేని ప్రభుత్వ కళాశాల క్వారంటైన్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ క్వారంటైన్‌లో ఉన్న వారంతా ఆందోళకు గురవుతున్నారు. Also read: తేని జిల్లా ఆండి పట్టికి చెందిన శశికుమార్ రెండు రోజుల క్రితం ముంబయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజులు క్వారంటైన్‌లోనే ఉండాలని డాక్టర్లు, అధికారులు సూచించారు. అయితే తనకు ఎలాంటి వైరస్ లేనప్పుడు క్వారంటైన్‌లో ఎందుకు ఉండాలని శశికుమార్ నిలదీశాడు. అయితే 14రోజులు అక్కడ ఉంటేనే ఇంటికి పంపిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్వారంటైన్‌కు తరలించారన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also read:
By May 19, 2020 at 09:39AM
No comments