త్వరలో మీకే తెలుస్తుంది.. అదే జరగలేదంటే ఈ పోస్ట్ ఉండనే ఉండదు: పరేషాన్ చేసిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అప్‌డేట్స్ అంటే అభిమానులకు ఎప్పుడూ అదో మజానే. అందుకే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు తన, తన కుటుంబ విషయాలు పంచుకుంటూ ఉంటుంది సామ్. భర్త అక్కినేని నాగచైతన్యతో టూర్స్, ఫారెన్ వెకేషన్ ట్రిప్స్ వేస్తూ ఆ ఫొటోలు షేర్ చేసి మాయ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా మరో పోస్ట్ చేసి పరేషాన్ చేసేసింది సమంత. ఇకపై మరింత మంచి నటి కాబోతున్నా. వేచి చూడండి. మంచి నటి అనిపించుకోకపోతే ఈ పోస్ట్ డిలీట్ చేస్తా అంటూ తన హోమ్ క్వారంటైన్ సంగతులు చెప్పింది సామ్. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ మొత్తం వాయిదా పడటంతో సినీ నటులంతా ఇంట్లోనే ఉంటూ ఈ విరామ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా వాడుకుంటున్నారు. అయితే సమంత మాత్రం నటనలో ఆన్‌లైన్ శిక్షణ పొందుతోంది. కొత్తపాఠాలు నేర్చుకొని ఇకపై మరింతగా అలరిస్తా అంటోంది. Also Read: ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన సమంత అందుకు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ.. ''1000 గంటల్లో ఒక్క గంటనైనా చక్కగా ఉపయోగించుకున్నప్పుడు అది అందరికీ చెప్పాల్సిందే. ఇక నేను ఉత్తమ నటిగా మారబోతున్నా. అది త్వరలోనే మీరే చూస్తారు. ఒకవేళ అదే జరగక పోతే ఈ పోస్ట్ డిలీట్ చేస్తా'' అని పేర్కొంది. ఆమె చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడమే గాక ప్రేక్షకులను పరేషాన్ చేస్తోంది. దీంతో 'అదేంటి మేడం.. మీరు ఇప్పటికే ఉత్తమ నటి కదా. మళ్ళీ ఇలా అంటున్నారేంటి?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పెళ్లి తర్వాత వరుస హిట్స్ అందుకున్న సమంత ఇటీవలే 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందింది. డిజిటల్ రంగంలోనూ మార్క్ చూపించాలని ప్లాన్ చేసిన ఆమె త్వరలో ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ సీజన్ 2తో అలరించనుంది.
By May 07, 2020 at 09:22AM
No comments