మహేష్, విజయ్‌పై అనసూయ సెటైర్లు,, ఆడుకుంటున్న నెటిజన్స్
ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరో హాట్ టాపిక్‌గా మారాడు. అతడిపై కొన్ని సైట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని విజయ్ మండిపడ్డారు. కరోనా కోసం విజయ్ ఎలాంటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు విజయ్‌కు అండగా నిలుస్తున్నారు. హీరో మహేష్‌తో పాటు, అల్లరి నరేష్ నీకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో జబర్దస్త్ కూడా వేలు పెట్టింది. తగుదునమ్మా అంటూ సోషల్ మీడియాలో విజయ్ వ్యవహారంపై సెటైర్లు వేసింది. ‘మనవరకు వస్తే కాని బుద్ధి రాదన్న మాట...’ అంటూ ఎద్దేవా చేసింది. దీంతో ఆమెను అటు విజయ్ అభిమానులు, ఇటు మహేష్ అభిమానులు ఆడుకుంటున్నారు. అన్నింటిలో వేలు పెడతావా నీకు వేరే పని ఏం లేదా అంటూ అనసూయపై నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. అసలు నువ్వు విరాళం ఇచ్చావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు... జబర్దస్త్‌లో కుళ్లి జోకులు వేసుకో... నీకు ఎందుకు ఇలాంటివి అన్ని అంటూ అనసూయకు చురకలు అంటిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎప్పుడూ ట్విట్టర్లోనే ఉంటావా ఏం ఆంటీ అంటూ మరికొందరు నెటిజన్స్ అనసూయను ఏకి పారేస్తున్నారు. కొందరు నెటిజన్స్ మాత్రం మీరు చెప్పింది నిజమే అనసూయ గారు.. మనదాకా వస్తే కాని తెలియదు. కానీ మీలాంటి వారు ఇలాంటి విషయాల్లో మద్దతు ఇవ్వాలి... అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా 'ది దేవరకొండ ఫౌండేషన్' స్థాపించి అందులో 'మిడిల్ క్లాస్ ఫండ్'తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని సైట్లు తప్పుడు కథనాలు ప్రచురించాయని విజయ్ మడిపడుతున్నాడు. విజయ్ దేవరకొండ పేద ప్రజలను అవమానిస్తున్నారని.. వెబ్‌సైట్ పెట్టి సాయం చేస్తున్నట్టు హంగామా చేస్తున్నారని అనేక వార్తలు రాశాయి. అంతేకాకుండా విజయ్ ఎందుకు విరాళం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూనే, చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)కి పోటీగా మిడిల్‌క్లాస్ ఫండ్‌ను విజయ్ ప్రారంభించారంటూ కొన్ని వెబ్‌సైట్స్ కథనాలు రాశాయి. తప్పుడు కథనాలపై విజయ్ చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ తారలు మద్దతు పలుకుతున్నారు. తాజాగా కాజల్ కూడా మద్దతు తెలుపుతూ ట్వీట్ తెలిపింది.
By May 05, 2020 at 09:39AM
No comments