Breaking News

బ్రేకింగ్ న్యూస్: నేడే దిల్ రాజు రెండో పెళ్లి.. అధికారిక ప్రకటన


తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న రెండో పెళ్ళికి సిద్దమయ్యారనే వార్త ఎప్పటినుండో వైరల్ అవుతూ వస్తోంది. గత మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో నువ్వు ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, మరో పెళ్లి చేసుకొని కాస్త రిలాక్స్ కావాలని దిల్ రాజు సన్నిహితులు చెప్పారని, దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారని వార్తలు విన్నాం. 2020 ఆరంభంలోనే ఆయన పెళ్లి జరగనుందని, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వచ్చింది కానీ నిజం కాలేదు. అయితే దిల్ రాజును పెళ్లి చేసుకోబోతున్న వ్య‌క్తి ఎవ‌రు? ఇండ‌స్ట్రీకి చెందిన వ్యక్తా.. లేక బ‌య‌టి వ్య‌క్తా? ఈ వ‌య‌స్సులో దిల్ రాజు నిజంగానే రెండో పెళ్లి చేసుకుంటాడా? ఇలా అనేక రకాల సందేహాలు జనం మెదళ్లలో మెదిలాయి. ఈ ఇష్యూపై రకరకాల వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన రెండో పెళ్లిపై స్వయంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు దిల్ రాజు. Also Read: ''ఈ ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఎవ్వరూ జీర్ణించుకోలేపోతున్నారు. ఇలాంటి సమయంలో వృత్తిపరంగా అంత త్వరగా కోలుకోలేము. వ్యక్తిగతంగానూ నాకు గత కొన్ని రోజుల నుంచి మంచి టైమ్ రాలేదు. అంతా త్వరలోనే సర్దుకుంటుందని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. అందుకు ఇదే అదునైన సమయంగా భావిస్తున్నా'' అని దిల్ రాజు పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఈ రోజు (ఆదివారం) రాత్రి రెండో వివాహం చేసుకోబోతున్నారు దిల్‌రాజు. ప్రభుత్వ సూచనల మేరకు ప‌దిమందిలోపు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో దిల్‌రాజు పెళ్లి జరగనుందని సమాచారం.


By May 10, 2020 at 10:16AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/official-note-on-dil-raju-second-marriage/articleshow/75654544.cms

No comments