విజయ్ దేవరకొండకి మద్దతుగా నిలుస్తున్న చిత్ర పరిశ్రమ..
లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా బాగా చితికిపోయిన కుటుంబాలకి సాయం చేయడానికి విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ ని ఏర్పాటు చేసి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై ఒకానొక గాసిప్ వెబ్ సైట్ విజయ్ పై అనేక ప్రశ్నలు కురిపించింది. చెప్పేది ఎక్కువ, చేసింది తక్కువ అన్న రీతిలో విజయ్ ప్రవర్తన ఉందని విమర్శలు చేశారు. ఇలాంటి విమర్శలకి విజయ్ చాలా గట్టిగా సమాధానం ఇచ్చాడు.
ఆ గాసిప్ వెబ్ సైట్లని బ్యాన్ చేయాలన్నంత రీతిలో విజయ్ స్పందించాడు. అయితే విజయ్ పిలుపుకి తోడుగా చిత్రబృందం కదిలి వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దేవరకొండకి మద్దతుగా నిలిచాడు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, కొరటాల శివ, వంశీ పైడిపల్లి..ఇలా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. దాదాపుగా చిత్ర పరిశ్రమ మొత్తం విజయ్ కి అండగా నిలుస్తుంది.
చిత్ర పరిశ్రమ మొత్తం యునైటెడ్ గా కదిలిరావాల్సిన సమయం వచ్చిందంటూ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కదులుతున్నారు. మరి విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసిన ఈ యుద్ధం ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.
By May 05, 2020 at 06:57PM
No comments