Breaking News

మూడేళ్ల ప్రేమ... లాక్‌డౌన్‌లోనే పెళ్లి.. నెల తిరగకముందే ఆత్మహత్య


తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య చేసుకుంది. జిల్లా తానియంబట్టు తాలుకా మోదకాల్‌ గ్రామానికి చెందిన వేటియప్పన్‌ కుమారుడు జయకుమార్, క్రిష్ణగిరి జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మిలు గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. మొదట్లో ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. అయితే ఇద్దరూ వేరే వ్యక్తులను పెళ్లి చేసుకోమని పట్టుబట్టడంతో తప్పేది లేక వివాహానికి అంగీకరించారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఏప్రిల్ 6న ఓ ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి జరిగింది. ఈ యువజంట మోదకాల్ గ్రామంలోనే వేరు కాపురం పెట్టి నివసిస్తున్నారు. Also Read: మంగళవారం దంపతులు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా ఇద్దరూ గదిలో ఉరేసుకుని కనిపించారు. దీంతో గ్రామస్థులు వెంటనే తానేపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదని కుటుంబసభ్యులు, గ్రామస్థులు చెబుతున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలా? లేక కుటుంబ కలహాలా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By May 14, 2020 at 08:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-couple-commits-suicide-in-tamil-nadu/articleshow/75729108.cms

No comments