Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: గాలిద్వారా కరోనా వ్యాప్తి.. చైనా హాస్పిటల్స్‌లో ఆధారాలు!


ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు జగ్గీవాసుదేవ్ 5x5 కాన్వాస్ పై ‘టు లివ్ టోటల్లి’ అనే శీర్షికతో వేసిన ఒక పెయింటింగ్ రూ.4.14 కోట్లకు అమ్ముడు పోయింది. ఈ మొత్తాన్ని తమిళనాడులో ఈశా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్నపాండమిక్ రిలీఫ్ కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఈ మధ్య జరిగిన ఒక సత్సంగంలో ‘బీట్ ద వైరస్ ఫండ్’కు ఎవరైతే ఎక్కువ మొత్తంలో విరాళం ఇస్తారో, వారికి ఈ పెయింటింగ్ దక్కుతుంది అని సద్గురు ప్రకటించారు. దేశంలో మహమ్మారి తీవత్ర కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో దాదాపు 2వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 37 వేలు దాటింది. మరో 77 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,223కి చేరింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే 11వేల మంది వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు గత నెలన్నరగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేయడానికి పని కరువై.. చేతిలో చిల్లిగవ్వయినా లేకుండా పరాయి పంచన బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వలస జీవులు సొంతూరు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తమను స్వస్థలాలకు పంపించాలని పదే పదే కోరుతుండటంతో ఎట్టకేలకు కేంద్రం వారి మొర ఆలకించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఉన్న జిల్లాల వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉండగా.. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా ప్రకటించింది. ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 1400కు పైగానే ఉన్నాయి.. వీటిలో ఒక్క కర్నూలు జిల్లాలోనే 411 ఉన్నాయి. ఈ మహమ్మారికి 10మంది బలయ్యారు. కొంతమంది డాకర్టలుకు కూడా వైరస్ సోకడం కలవరం రేపింది. అయితే తాజాగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో కీలక అధికారికి కరోనా పాజిటివ్ సోకినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి రెండు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల ప్రాణాలను బలి తీసుకుంది. వనస్థలిపురంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకగా.. వృద్ధుడైన తండ్రి ఇటీవలే ప్రాణాలు కోల్పోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం (మే 1) ఒక్క రోజే ఢిల్లీలో 223 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3738కి చేరుకుంది. అయితే.. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కరోనా రోగుల విషయంలో ప్లాస్మా థెరపీ సత్ఫలితాలను ఇస్తోందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రయోగాలను నిలిపివేయడం కుదరదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ రోగుల్లో ప్లాస్మా థెరపీ ప్రభావంతంగా పని చేస్తోందని వివరించారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ కంపెనీ కరోనా వైరస్‌ను రెండు నిమిషాల్లో అంతమొందించే ఓ రోబోను రూపొందించింది. అత్యంత తీవ్రతతో ఉన్న అల్ట్రా వయోలెట్ సీ (యూవీసీ లైట్) కాంతి సాయంతో వైరస్‌ను నాశనం చేస్తారు. పూర్తి కథనం.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ కంపెనీ కరోనా వైరస్‌ను రెండు నిమిషాల్లో అంతమొందించే ఓ రోబోను రూపొందించింది. అత్యంత తీవ్రతతో ఉన్న అల్ట్రా వయోలెట్ సీ (యూవీసీ లైట్) కాంతి సాయంతో వైరస్‌ను నాశనం చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో 12 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను జైలుకు తరలించారు. వీరిలో తొమ్మిది మంది థాయ్‌లాండ్‌ దేశస్థులు కాగా ముగ్గురు తమిళనాడుకు చెందినవారు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్‌ భవనంలో మత సమావేశాలకు హాజరై వచ్చిన వీరు యూపీలోని ఓ మసీదులో రహస్యంగా తలదాచుకున్నారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనే వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. వుహాన్‌(చైనా)లోని రెండు ఆసుపత్రుల్లో గాలిలోని తుంపర్లలోనూ వైరస్‌ జాడలను గుర్తించారంటూ నేచర్‌ పత్రికలో కథనం ప్రచురితమైంది. శాస్త్రవేత్తలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహాన్‌లోని రెన్మిన్‌ ఆసుపత్రితోపాటు కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారిని క్వారంటైన్‌ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి గాలి నమూనాలను సేకరించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్నవారికి రూ.10వేలు సాయం అందిస్తున్నారు. తన కుమారుడి సీఎంఆర్ గ్రూప్స్ ద్వారా సాయం అందించారు.. ఈ మేరకు రూ.25లక్షల చెక్కును టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. పూర్తి కథనం.


By May 02, 2020 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-of-coronavirus-cases-deaths-in-andhra-and-telangana-across-india-state-wise-live-updates-in-telugu/articleshow/75500553.cms

No comments