Breaking News

అఫైర్ బయటపడిందని జంట ఆత్మహత్య.. కామారెడ్డి జిల్లాలో కలకలం


కారణంగా ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినా.. వారు గుట్టుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం వారి ఇళ్లల్లో తెలిసిపోవడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)కు కొంత కాలమే వేర్వేరు వ్యక్తులతో వివాహాలు అయ్యాయి. బాలనర్సుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, ప్రేమలతకు భర్త, కుమారుడు ఉన్నారు. Also Read: అయితే వీరిద్దరికి ఏర్పడిన పరిచయం కాస్తా ముదిరి అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో అప్పుడప్పుడూ బయట కలుసుకుంటూ రాసలీలలు కొనసాగించేవారు. అయితే హఠాత్తుగా శనివారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు బాలనర్సు, ప్రేమలత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి అక్రమ సంబంధం ఇరు కుటుంబాల్లో తెలిసిపోవడంతో మొహం చూపించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


By May 17, 2020 at 07:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/couple-commits-suicide-in-kamareddy-district-over-released-thier-illegal-affair/articleshow/75780426.cms

No comments