ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. అవును చాలా మందితో! అయితే ఏంటి? హాట్ బ్యూటీ సంచలనం
ఈ రోజుల్లో హీరోయిన్స్ ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు, నిజ జీవితంలో తాము చేసిన, చేస్తున్న డేటింగ్ సంగతులు, బ్రేకప్ విషయాలు చెప్పడానికి ఏ మాత్రం సందేహించడం లేదు. పైగా ఆధునిక యుగంలో ఇలాంటివన్నీ కామన్, మీడియా వాటినే హైలైట్ చేస్తూ బూతద్దంలో చూడటమెందుకు? అని ప్రశ్నిస్తున్నారు అందాల తారలు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే తన లవ్ అఫైర్ల గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ గట్టిగానే ఇచ్చుకుంది హాట్ బాంబ్ . కెరీర్ ఆరంభం నుంచే కాంట్రవర్సీ క్వీన్ అనిపించుకుంటున్న లక్ష్మి రాయ్ మరోసారి ఆటమ్ బాంబ్ పేల్చింది. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని అనే ప్రసక్తే ఉండదని చెబుతూ.. కెరీర్ మొదట్లో తనకు కూడా ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎలాగోలా బయటపడ్డా, సులభంగానే ఆఫర్స్ వచ్చాయి కానీ.. కొంతమంది ఇచ్చిన సలహాల కారణంగానే తన కెరీర్ దెబ్బతిందని చెప్పుకొచ్చింది. ఇక మీడియాలో తన లవ్ ఎఫైర్ గురించి, అదేవిధంగా తాను గర్భవతిని అని వస్తున్న వార్తలు చూస్తుంటే చిరాకుగా ఉందని అంటోంది లక్ష్మి రాయ్. ఇష్టానుసారంగా రాసే వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అవును.. నిజమే! నాకు చాలా మందితో రిలేషన్ ఉంది. లవ్ ఎఫైర్స్ కూడా ఉన్నాయి. ఆ వెంటనే బ్రేకప్ కూడా జరిగింది.. అంత మాత్రానికే మీ ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తారా అంటూ మరోసారి ఘాటుగా రియాక్ట్ అయింది లక్ష్మి రాయ్. ఇప్పటికే మూడుసార్లు ప్రేమలో మోసపోయానని చెప్పిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని అంటోంది. తన లైఫ్‌లో ఓ మంచి వ్యక్తి దొరుకుతాడనే నమ్మకం ఉందని ఆమె చెప్పింది. తెలుగులో పలు చిత్రాలు, ఐటెం సాంగ్స్ చేసిన లక్ష్మి రాయ్.. చిరంజీవితో 'రత్తాలు రత్తాలు' సాంగ్‌లో ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ సొగసులతో కుర్రకారుకు కిక్కిస్తోంది ఈ హాట్ ఆటమ్ బాంబ్. Also Read:
By May 03, 2020 at 08:03AM
No comments