అకిరా ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ కాదు... మరి ఎవరో తెలుసా ?
టాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటారు. ఆయనకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చిన అది సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్‌లో షికార్లు కొడుతూ ఉంటుంది. ఇక పవన్ ఫ్యామిలీకి సంబంధించిన వార్తలను అయితే ఆయన అభిమానులు మరింత ఆసక్తిగా వింటారు. తాజాగా పవర్ స్టార్ మాజీ భార్య మరోసారి పవన్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్, రేణు దేశాయ్‌కు ఇద్దరు పిల్లలు. , ఆద్య కొణిదెల. అకిరా ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా ఇప్పటికే తన హైట్‌తో.. తనకంటూ స్పెషల్ బజ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో అకిరా అంటే పవన్ అభిమానులు కూడా ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే తాజాగా ఎవరన్న విషయాన్ని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ ఇంటర్య్వూలో చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అకిరా ఫేవరెట్ హీరో ఎవరని ప్రశ్నకు బదులుగా.. అకిరాకు అడవి శేష్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. 'ఎవరు' సినిమా చూసిన తరువాత నుంచి అకిరా.. అడివి శేష్‌ని అమితంగా ఇష్టపడటం మొదలు పెట్టాడు. వారిద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులు కూడా అని తెలిపారు. అదే విధంగా అడివి శేష్‌ని అకిరా.. అన్న అని పిలుస్తాడని చెప్పుకొచ్చారు. అలాగే వీరు అప్పుడప్పుడూ కలుస్తూ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారని రేణు దేశాయ్ ఇంటర్య్వూలో తెలిపారు. అయితే అంతకుముందు కూడా అడవి శేష్ రేణు దేశాయ్ ఇంటికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అకిరాతో అడవి శేష్ కలిసి దిగిన ఫోటోల్ని అతడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అకీరా గురించి అనేక విషయాలు శేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అకిరా అందమైన కుర్రాడు అన్నాడు. అకీరాకు ఎవరు చిత్రం చాలా బాగా నచ్చిందని తెలిపాడు. లంచ్ మీటింగ్‌లో అనేక విషయాలు మాట్లాడుకున్నామన్నారు. అకీరా వాయిస్ చాలా గంభీరంగా ఉందని .. అతని పొడవు 6. 4 అంగుళాలన్నాడు. అయితే వారిద్దరూ ఎడమచేతి వాటం కలిగిన వాళ్ళని అడవి శేష్ తెలిపాడు. అంతే కాదు మా ఇద్దరిలో అనేక కామన్ విషయాలు ఉన్నాయిని అకిరా గురించి అడవి శేష్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన తాజా కామెంట్స్‌తో అడవి శేష్, అకిరా మంచి స్నేహితులుగా మారారని తెలుస్తోంది.
By May 11, 2020 at 11:51AM
No comments