అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/75933079/photo-75933079.jpg)
భార్య తనపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలోని వించిపేట, టీఎస్‌పీ వీధి కొండ ప్రాంతంలో కొమర ప్రసాద్ (46), భార్య ఆదిలక్ష్మితో కలిసి నివసిస్తున్నాడు. ఆయన మున్సిపల్ కార్పోరేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై ప్రసాద్ ఉద్యోగానికి సక్రమంగా వెళ్లకపోవడంతో అనేకసార్లు సస్పెండ్ అయ్యాడు. దీంతో జీతం సక్రమంగా రాక ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాడు. Also Read: దీంతో ఆదిలక్ష్మి తన వద్ద ఉన్న బంగారం గొలుసు ఓ బ్యాంకులో తాకట్టు పెట్టింది. దానిని తీసుకువచ్చే విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలోనే తాను కొద్దిరోజులు దూరంగా ఉంటే భర్త మారతాడన్న ఆలోచనతో ఆదిలక్ష్మి ఈ నెల 21న కేఎల్‌రావునగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. దీంతో భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందన్న మనస్తాపంతో ప్రసాద్ మనోవేదనకు గురయ్యాడు. శనివారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. Also Read:
By May 24, 2020 at 07:54AM
No comments