దిల్ రాజు పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. చెప్పినట్లుగానే నిన్న రాత్రి!!
ప్రముఖ నిర్మాత రెండో పెళ్లి నిన్న (ఆదివారం) రాత్రి నిరాడంబరంగా జరిగింది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. 49 ఏళ్ల వయసులో దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిన్న ఉదయం తన రెండో పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన దిల్ రాజు నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో రాత్రి 11 గంటల సమయంలో వివాహం చేసుకున్నారు. దిల్ రాజు పెళ్లి వార్త బయటకు రాగానే.. అటు ఇండస్ట్రీలోనూ బయటి జనంలో కూడా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువతి ఎవరు? అనే సందేహం మొదలైంది. అయితే దిల్ రాజు కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఆయనకు బాగా తెలిసిన బ్రాహ్మణ యవతిని ఆయన పెళ్లాడారని సమాచారం. దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆమె కూతురు హన్షిత రెడ్డి అన్నీ తానై చూసుకుంది. గత మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో నువ్వు ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, మరో పెళ్లి చేసుకొని కాస్త రిలాక్స్ కావాలని దిల్ రాజు సన్నిహితులు చెప్పారని, దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని తెలిసింది.
By May 11, 2020 at 11:15AM
No comments