విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు
విశాఖపట్నంలో అర్థరాత్రి జరిగిన విష వాయువు దుర్ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. కేంద్రం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అన్నిరకాల సహాయ సహకారాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. తాజాగా ఈ ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి సైతం స్పందించారు. విశాక ఘటన విని తాను షాక్‌కు గురయ్యానన్నారు. వెంటనే అక్కడున్న పార్టీ శ్రేణుల్ని ఆయన అప్రమత్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు సీఎం చంద్రబాబు. విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించాలి కాబట్టి ఆయన తనకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దీంతో కేంద్రం తనకు అనుమతి ఇస్తే వెంటనే విశాఖ వెళ్తానని చంద్రబాబు తెలిపారు. ఇక వైజాగ్‌తో చంద్రబాబుకు ఎంతో అనుబంధం ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైజాగ్‌ను ఆయన సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. హుద్ హుద్ తుఫాను సమయంలో కూడా విశాఖ వాసులకు చంద్రబాబు అండగా నిలిచారు. తుఫాను బీభత్సం సృష్టించినా... నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయన పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అదే అనుభవంతో ఇలాంటి సమయంలో కూడా తనకు వైజాగ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మరి కేంద్రం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు విశాఖలో పరిస్థితి భయానకంగా మారింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ కూడా కాసేపటి క్రితమే ప్రత్యేక హెలికాఫ్టర్‌లో విశాఖకు బయల్దేరారు. ఆయన బాధితుల్ని పరామర్శించనున్నారు. విష వాయువు ప్రబలిన ప్రాంతాల్లో కూడా జగన్ పర్యవేక్షించనున్నారు.
By May 07, 2020 at 11:36AM
No comments