Breaking News

వాట్సాప్ గ్రూపులు పెట్టి టార్గెట్ చేస్తూ! నరకం అనుభవించా.. సింగర్ సునీత ఆవేదన


కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని పెద్దలు చెప్పినట్లు కెరీర్ సాఫీగా సాగిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదిగే వారిపైనే విమర్శలు చేస్తుంటుంది ఈ లోకం. ఓ వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో ఎదుగుతున్నారంటే చూస్తూ ఆనందించే వాళ్ళు కొందరైతే.. ఎలాగైనా ఆ వ్యక్తి ఇమేజ్ డామేజ్ చేయాలని చూసేవాళ్ళు ఇంకొందరు. కెరీర్‌పై దెబ్బకొడుతూ రాక్షసానందం పొందే వారు ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉంటారు. తన కెరీర్‌లో అలాంటి పరిణామాలే ఎదురయ్యాయని పేర్కొంటూ ఆవేదన చెందారు సింగర్ . ఈ మేరకు సోషల్ మీడియాలో వివరణాత్మక సందేశం పోస్ట్ చేశారు. కెరీర్ ఆరంభంలోనే గులాబీ సినిమాలో 'ఈవేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావు' అనే పాటతో అందరినీ ఆకర్షించారు సునీత. ఆ నాటి నుంచి నేటి వరకు ఈ సాంగ్ వింటూ ఊహాలోకంలో విహరిస్తుంటారు యూత్ ఆడియన్స్. ఈ ఒక్క పాటతోనే అందరినీ ఆకుట్టుకున్న ఆమె.. ఆ తర్వాత ఎన్నో సినిమాలో పాటలు పాడి సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. స్వీట్ వాయిస్‌తో క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఫిదా చేసేసింది. అయితే ఆమె కూడా తన కెరీర్‌లో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొందట. ఆ విషయాన్ని తెలుపుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు సునీత. Also Read: కెరీర్ ఎదుగుతున్న సమయంలో కొంతమంది తనను కావాలనే టార్గెట్ చేశారని, ఎలాంటి కారణం లేకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ నరకం చూపించారని చెప్పారు. కొంతమంది జూనియర్ సింగర్స్ కూడా ఎగతాలి చేస్తూ ఇమిటేట్ చేయడం బాధగా అనిపించిందని సునీత పేర్కొన్నారు. కొందరు తెలిసిన అడవాళ్లే తన గురించి చెడుగా మాట్లాడుతూ, చెడు ప్రచారాలు చేయడం చూసి చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. ''ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం నేను చూశాను. అలాగే నా గురించి గాసిప్ చేయడానికి వాట్సాప్ గ్రూపులు పెట్టి స్పెషల్ టార్గెట్ చేయడం కూడా చూశాను. వెబ్‌సైట్లు నా గురించి అర్ధంలేని ఆర్టికల్స్ రాయడం చూశాను. విజయాలు, అపజయాలు చూస్తూ మౌనంగా కష్టాల్లోనే నా జీవితాన్ని వెతుకున్నాను. ఎన్ని సమస్యలొచ్చినా కూడా ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. అన్నింటినీ ఎదుర్కొని నా అభిమానుల కోసం సింగర్‌గా ఈ స్థాయికి చేరుకున్నాను. ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నాను. అదే నాకు చాలా ఆనందాన్నిచ్చింది'' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు సునీత. ఆమె చేసిన ఈ పోస్ట్ చూసి మీకెప్పుడూ మేము అండగా నిలుస్తాం మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


By May 12, 2020 at 08:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/singer-sunitha-emotional-post-on-her-real-life-and-career/articleshow/75687375.cms

No comments