Breaking News

భార్యతో దిల్ రాజు తొలి సెల్ఫీ... ఫోటో వైరల్


టాలీవుడ్ నిర్మాత చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన వివాహం జరిగింది. అయితే గత రెండు రోజులుగా దిల్ రాజు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన రెండో పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆయన తన భార్యతో దిగిన తొలి సెల్ఫీ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న అమ్మాయి పేరు తేజస్విని అలియాస్ వైఘా రెడ్డి. దగ్గరి బంధువులకి సంబంధించిన అమ్మాయి అని కొందరు అంటుండగా, మరి కొందరు బ్రాహ్మణ యువతి అని చెప్పుకొస్తున్నారు. దిల్ రాజు కులంతార వివాహం చేసుకున్నారన్న టాక్ కూడా టాలీవుడ్‌లో జోరుగా నడుస్తోంది. మరోవైపు నెటిజన్స్, దిల్ రాజు అభిమానులు మాత్రం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ ఇద్దరి జంట బావుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా భార్యతో కలిసి దిల్ రాజు దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ ఫోటోలో దిల్ రాజు పింక్ కలర్ షర్ట్‌లో ఉండగా... ఆయన భార్య తేజస్విని గ్రీన్ కలర్ టాప్‌లో ఉన్నారు. వివాహం అనంతరం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఇదే మొదటిదని అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత.. 2017 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. వీరికి ఒక కూతురు హన్షిత రెడ్డి కూడా ఉన్నారు. ఆమె కూడా తన తండ్రి రెండో వివాహంపై స్పందించారు. ఇద్దరూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా దిల్ రాజు కూతురు శుభాకాంక్షలు తెలిపారు.


By May 13, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dil-rajus-first-selfie-with-his-wife-after-wedding-goes-viral/articleshow/75708068.cms

No comments