కార్తీకదీపం సీరియల్‌పై టాలీవుడ్ డైరెక్టర్ వెదవ కామెంట్స్.. సీన్ రివర్స్ కావడంతో!!
వెండితెరపై సినిమాల హవా కొనసాగుతుంటే బుల్లితెరపై వాటికి గట్టి పోటీ ఇచ్చేవి ఒక్క సీరియల్స్ మాత్రమే. భారీ టీఆర్ఫీ రేటింగ్స్ దక్కించుకుంటూ నిత్యం మహిళా లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి చిన్నితెర సీరియళ్లు. అప్పట్లో అంతరంగాలు, మొగలిరేకులు, చక్రవాకం లాంటి సీరియల్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు '' డైలీ సీరియల్ అంతకుమించిన పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంట చూసినా ఈ సీరియల్ తాలూకు సంగతులపై చర్చలు నడుస్తూనే ఉంటాయి. మలయాళంలో 2014లో ప్రసారమై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కరుతముత్తు’కు రీమేక్‌గా 'కార్తీకదీపం' రూపొందుతోంది. ఇందులో దీప అలియాస్ వంటలక్క ఫుల్ ఫేమస్. సినిమా హీరోయిన్లకు ధీటుగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం విశేషం. ప్రతీ దినం అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సీరియల్‌పై టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సెటైర్స్ వేశారు. ఏదో సరదా అనుకుంటే సీన్ రివర్స్ అయి తిట్లు పడ్డాయట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. ''అమ్మ కార్తీక దీపం సీరియల్‌కి పెద్ద ఫ్యాన్. రోజూ టిఫిన్ చేసేటప్పుడు సీరియల్ డిస్కషన్స్ వినీ వినీ లైట్‌గా అర్థం చేసుకున్నా. అప్పటి నుంచి వెదవ కామెంట్లు చేసి కావాలని తిట్లు తింటున్నా'' అని పేర్కొంటూ ఇది జస్ట్ ఫన్నీ.. ఎవ్వరినీ ఇబ్బందిపెట్టాలని కాదు అంటూ మహిళా లోకాన్ని స్పెషల్‌గా అట్రాక్ట్ చేశారు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇటీవలే ఈ డైరెక్టర్ రూపొందించిన HIT సినిమా విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే కరోనా వైరస్ నివారణలో భాగంగా దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో ‘కార్తీక దీపం’ సీరియల్ నిలిపివేసి మరోసారి మొదటి నుంచి ప్రసారం చేస్తున్నారు. రెండోసారి ప్రసారం చేస్తున్న కూడా ఇదే సీరియల్‌కు మంచి టీఆర్పీ వస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
By May 12, 2020 at 11:31AM
No comments