ఆర్మీ జవాన్ల రిటైర్మెంట్ వయసు పెంపు.. రావత్ ప్రకటన
సైన్యంలో పనిచేస్తున్న జవాన్ల పదవీవిరమణ వయసును పెంచనున్నట్లు జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆర్మీ జవాన్లతో పాటు వైమానిక దళంలో ఎయిర్‌మెన్, నేవీలో సెయిలర్ల రిటైర్మెంట్ వయసును కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిధ దళాల్లో పనిచేసే జవాన్ల రిటైర్మెంట్ వయసు పెంచేందుకు ఓ విధానాన్ని తీసుకున్నట్లు రానున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. దీని వల్ల త్రివిధ దళాల్లోని సుమారు 15 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. జవాన్లు కేవలం 15 లేదా 17 ఏళ్లే ఎందుకే సర్వీస్‌లో ఉండాలని, వారు 30 ఏళ్లు ఎందుకు సేవ చేయకూడదని బిపిన్ రావత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన సైనికులను తొందరగా కోల్పోకూడదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, జవాన్ల పదవీవిరమణ వయసు 58 ఏళ్లకు పెంచుతామని రావత్ చెప్పడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ విషయం గురించి ఆయన ప్రకటనలు చేశారు. త్రివిధ దళాల జవాన్ల పదవీ విరమణ వయస్సును పెంచడానికి ఒక అధ్యయనం చేపట్టామని ఫిబ్రవరిలో రావత్ అన్నారు. ‘డిఫెన్స్ పెన్షన్ల పెరుగుదల నిలకడలేనిది అవుతోందని, 33 శాతం సైన్యం 58 సంవత్సరాల వయస్సు వరకు విధులు నిర్వర్తించవచ్చే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత సైన్యంలో మూడింట ఒకవంతు మంది 58 ఏళ్ల వరకు పనిచేయవచ్చిన నా అభిప్రాయం. ప్రస్తుతం 38 ఏళ్లకే ఇంటికి పంపుతున్నారు.. అతను 70 ఏళ్ల వరకు జీవిస్తాడు.. కాబట్టి, 17 సంవత్సరాల సేవలకు మరో 30-32 సంవత్సరాల పెన్షన్ ఇస్తారు. 38 ఏళ్లు సర్వీసులో ఎందుకు కొనసాగకూడదు.. ఆ తర్వాత మరో 20 ఏళ్లు పెన్షన్ ఎందుకు ఇవ్వకూడదు?ఈ ధోరణిలో మార్పు రావాలి’ అని వ్యాఖ్యానించారు.
By May 14, 2020 at 09:21AM
No comments