Breaking News

హైదరాబాద్‌లో వ్యక్తి దారుణహత్య.. నడిరోడ్డుపై కత్తులతో వెంటాడి నరికి


నగరంలో కొద్దిరోజులుగా నేరాల సంఖ్య పెరుగుతోంది. అత్యాచారాలు, హత్యలు క్రమంగా పెరుగుతుండటంతో కలకలం రేపుతోంది. తాజాగా చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు దారుణంగా చంపేశారు. చాదర్‌ఘాట్‌కు చెందిన అబ్దుల్ రెహమాన్‌ను అజమ్‌పుర ప్రాంతంలో శనివారం రాత్రి టీఎస్09 ఎఫ్‌హెచ్5856 నంబర్ గల హుందాయ్ ఐ10 కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు చుట్టుముట్టారు. కత్తులతో అతడిని విచక్షణా రహితంగా నరికి పరారయ్యారు. Also Read: తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రెహమాన్‌ను స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నలుగురు వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. రెహమాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లాక్‌డౌన్ సందర్భంగా నగరమంతా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ.. బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య హైదరాబాద్‌ నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. రెహమాన్‌ను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసనట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read:


By May 10, 2020 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-killed-by-4-men-in-hyderabad-property-dispute-suspected/articleshow/75655216.cms

No comments