Breaking News

రాజస్థాన్: సర్కీస్కా ఫారెస్ట్‌లో రెండోసారి ముగ్గురికి జన్మనిచ్చిన ఆడపులి


రాజస్థాన్‌లోని సరీస్కా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎస్టీ-12 అనే పెద్ద పులి మరోసారి మూడు పులులను ప్రసవించింది. గత రెండేళ్లలో వేర్వేరు కాన్పుల్లో జన్మించిన ఆరు పిల్లలకు ఆమె తల్లిగా మారింది. సరిస్కాలోని ఏ పులి అయినా రెండు కాన్పుల్లోనే ఆరుగురు పిల్లలను కనడం, అవి ప్రాణాలతో ఉండటం ఇదో ఓ రికార్డు. సరిస్కా వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే తొలిసారిగా ఎస్టీ-12 పులి 2018లో ముగ్గురికి జన్మనిచ్చిందని అటవీ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇక, 2014లో జన్మించిన ఎస్టీ-13 మగపులితో జతకట్టిన ఎస్టీ-12 ఆడపులి ముగ్గురికి జన్మనిచ్చింది.. దీంతో ప్రస్తుతం సరీస్కాలో మొత్తం పులుల సంతతి 20కి చేరింది’ అని తెలిపారు. ఇందులో ఆరు పులులు ఎస్టీ-12 సంతానమే కావడం విశేషం. తాళ్‌వృక్ష రేంజ్‌లోని నీటి కేంద్రం వద్ద ఇటీవల ఏర్పాటుచేసిన కెమెరాల్లో అప్పుడే పుట్టిన తన ముగ్గురు పిల్లలతో ఉన్నట్టు రికార్డయ్యింది. దీనిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేశారు.‘తీవ్ర కరోనా సంక్షోభంలో ఉన్నవేళ.. ఎస్టీ-12 ఆడపులి శుభవార్త మోసుకొచ్చింది.. సరీస్కా అడవుల్లో మూడు పులికూనలు కెమెరాకు చిక్కాయి.. 2020కి సరీస్కాలో పులుల సంతతి 20కి చేరింది.. రాష్ట్రంలో వన్యప్రాణులు వృద్ధి చెందాలని నా కోరిక’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్న రాజస్థాన్ సీఎం.. ఫోటోలను షేర్ చేయడం విశేషం. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) సభ్యుడు, బీజేపీ ఎంపీ దివ్యా కుమారి సైతం ట్విట్టర్‌లో దీనిపై స్పందించారు. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో సరీస్కాలోని ఓ ఆడపులి ముగ్గురికి జన్మనిచ్చినట్టు వార్త వినడం ఆనందంగా ఉంది.. రాష్ట్రంలో వన్యప్రాణులు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. సరీస్కా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వింటే వేటలు గుర్తుకువస్తాయి. అలాంటి.. అక్కడ క్రమంగా పులుల సంతతి వృద్ధిచెందడం శుభపరిణామం. ఈ ఏడాది లాక్‌డౌన్ సమయంలో అక్కడ కొత్తగా నాలుగు పిల్లలు పుట్టాయి.. కాబట్టి, వేటలతో అపఖ్యాతి మూటగట్టుకున్న సరీస్కా.. చివరకు పులి సంరక్షణలో గొప్ప విజయం సాధించింది. మార్చి 30 న ఎస్టీ -10 నవజాత శిశువుతో తొలిసారిగా తాళ్‌వృక్ష శ్రేణిలో కనిపించింది. గత రెండేళ్లలో సరీస్కా పార్కులో కొన్ని పులులు మరణించిన తరువాత తాజా వార్త ఉపశమన కలిగిస్తుందని సరిస్కా టైగర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి దినేష్ వర్మ దురానీ వ్యాఖ్యానించారు. ‘సంవత్సరంలో నాలుగు పిల్లలు పుట్టడం రిజర్వ్ ఫారెస్ట్‌లో కొత్త శకం ప్రారంభానికి సూచిక. సరీస్కాకు అద్భుతమైన సామర్థ్యం ఉంది.. అటవీ శాఖ అధికారుల కృషిని అభినందిస్తున్నారు అని అన్నారు. ఇక్కడ మొత్తం 20 పులులలో ఎనిమిది ఆడ, మూడు మగ, ఐదు మధ్య వయస్సు పులులు, నాలుగు పిల్లలు ఉన్నాయి.


By May 27, 2020 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tigress-st-12-gives-birth-to-triplets-once-again-at-sariska-reserve-forest/articleshow/76026367.cms

No comments