పొరుగింటి వ్యక్తితో ఆంటీ అఫైర్.. నిద్రపోతున్న భర్తను కిరాతకంగా చంపి
పరాయి వ్యక్తితో పెట్టుకున్న ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపేసింది. ప్రియుడి మోజులో భర్త ప్రాణాలు తీసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతోంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని జేలార్ వాలాబాగ్ ప్రాంతానికి చెందిన శరత్ దాస్, అనిత భార్యాభర్తలు. పొరిగింట్లో ఉండే సంజయ్ అనే యువకుడిపై మోజు పడిన అనిత భర్త కళ్లుగప్పి అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. Also Read: రోజూ భర్త బయటకు వెళ్లగా ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న శరత్ దాస్ పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. దీంతో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన అనిత అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. మంగళవారం రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచిన అనిత.. దుప్పటి మొహానికి చుట్టి ఊపిరాడకుండా చేసి శరత్ ప్రాణాలు తీసింది. Also Read: భర్త అనారోగ్యంతో చనిపోయినట్లు అందరినీ నమ్మించింది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో అతడిని ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలడంతో పోలీసులు అనితను ప్రశ్నించారు. దీంతో భర్తను ప్రియుడి సాయంతో తానే చంపినట్లు అంగీకరించింది. పోలీసులు అనిత, సంజయ్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By May 07, 2020 at 09:43AM
No comments