Breaking News

బాలకృష్ణ కోసం లైన్ రెడీ.. చిరంజీవి కూడా దానికోసమే చూస్తున్నారు: అనిల్ రావిపూడి


ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు . పటాస్ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన ప్రేక్షకలోకాన్ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో తన టాలెంట్ బయటపెట్టి గతేడాది F2 సినిమాతో భారీ హిట్ సాధించారు. ఈ సినిమాతోనే కామెడీ పండించే నెంబర్ వన్ డైరెక్టర్‌గా గుర్తింపు పొంది ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో అనిల్ రావిపూడి సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు కడుపుబ్బా నవ్వుకోవాలని ఆతృతగా ఎదురుచూడటం మొదలుపెట్టారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే F2 సీక్వల్ F3 స్క్రిప్ట్ రెడీ చేస్తున్న ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాలకృష్ణ, చిరంజీవిలతో ఉండే అవకాశాలున్నాయని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అనిల్ రావిపూడి.. తాజాగా ఓ మీడియాతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో తర్వాత, ఆ తర్వాత చేయబోయే సినిమాల లైన్స్ కూడా రాసుకుంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఇప్పటికే లైన్ రెడీ చేశానని, అయితే మా ఇద్దరికీ డేట్స్ కుదరక ఇప్పటికి అది సాధ్యం కాలేదని, ఐడియా ఉంది బట్ ఎప్పుడు చేస్తామనేది చెప్పలేమని అన్నారు అనిల్. అంతేకాదు మెగాస్టార్ కూడా ఎంటర్‌టైనర్ జోనర్‌లో సినిమా చేయాలని చూస్తున్నారని, రెండు మూడు పార్టీల్లో ఆయన్ను కూడా కలిశానని చెప్పారు. స్లాట్ కుదిరితే చిరంజీవితో కూడా సినిమా చేస్తానని చెప్పారు అనిల్ రావిపూడి. చూద్దాం మరి బాలయ్య, చిరంజీవిలతో అనిల్ ఎప్పుడు నవ్వులు పండిస్తారో!. ‌ Also Read:


By May 01, 2020 at 07:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anil-ravipudi-ready-to-move-with-balakrishna-and-chiranjeevi/articleshow/75483169.cms

No comments