Breaking News

ఎన్టీఆర్ 97వ జయంతి.. బాలయ్య, నందమూరి కుటుంబ సభ్యుల నివాళి


విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయుడి పుట్టిన రోజు సందర్భంగా , రామకృష్ణ, సుహాసినితో పాటూ పలువురు ట్యాంక్‌బండ్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్ పుట్టినరోజును తెలుగు ప్రజలు ఓ పండుగలా భావిస్తున్నారన్నారు బాలయ్య. ఆయన నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని.. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి పార్టీ స్థాపించారన్నారు. రాజకీయాల్లోకి యువతను ఆహ్వానించిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్.. పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని గుర్తు చేశారు. విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్.. ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. తెలుగువాళ్ల సత్తా జాతీయస్థాయిలో చాటిన నేత ఎన్టీఆర్ అన్నారు. ఇదిలా ఉంటే ప్రతి ఏటా ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించే జూనియర్ ఎన్టీఆర్.. ఈసారి మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి ఉండటంతో ఘాట్‌కు వెళ్లకుండా ఇంటి నుంచే నివాళులు అర్పించాలని నిర్ణయం తీసుకున్నారట.


By May 28, 2020 at 08:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-bala-krishna-and-family-members-pays-tribute-to-sr-ntr-on-his-birth-anniversary/articleshow/76056261.cms

No comments