చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. భార్య 8నెలల గర్భిణి
కుటుంబ కలహాలతో జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. చిత్తూరు జిల్లా మండలం చంద్రమాకులపల్లెకు చెందిన సోమశేఖర్ (25) తిరుపతి అర్బన్ జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పాకాల మండలం పాటూరు గ్రామానికి చెందిన సారిక అనే యువతితో అతడికి ఏడాది క్రితం వివాహం జరిగింది. సారిక ప్రస్తుతం 8 నెలల గర్భిణి. వీరు తిరుపతిలోని ఇందిరానగర్‌లో కాపురం ఉంటున్నారు. Also Read: సోమవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో సారిక తాను పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించి బయటకు వచ్చేసింది. నువ్వు వెళ్లిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమశేఖర్ ఆమెను బెదిరించి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. భర్త బెదిరిస్తున్నాడనుకుని సారిక కాసేపు బయటకే కూర్చుంది. ఎంతసేపటికి అతడు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో తలుపు తట్టింది. లోపలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో కేకలు పెట్టింది. దీంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సోమశేఖర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. Also Read: దీంతో వారు అతడికి కిందికి దించి వెంటనే స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణంలో సారిక కన్నీరుమున్నీరవుతోంది. భర్త ఏదో ఆవేశంలో గదిలోకి వెళ్లాడనుకున్నాను గానీ.. ఇంత అఘాయిత్యానికి పాల్పడతాడని అనుకోలేదని ఆమె ఆవేదన చెందుతోంది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు, తనకు దిక్కెవరని ఆమె రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By May 06, 2020 at 09:19AM
No comments