Breaking News

ముంబయి-హరిద్వార్ శ్రామిక్ రైల్లో ప్రయాణించిన 87 మందికి కరోనా పాజిటివ్


మహారాష్ట్రలోని ముంబయి నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు మే 20న శ్రామిక్ రైల్లో ప్రయాణించిన వలస కూలీల్లో 87 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ రైలులో దాదాపు 1,500 మంది ప్రయాణించగా.. శనివారం 55 మందికి, ఆదివారం మరో 32 మందికి వైరస్ నిర్ధారణ అయినట్టు ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ సంఖ్య వచ్చే రెండు రోజుల్లో మరింత పెరుగుతుందని, మరో 3,000 మందికి సంబంధించిన పరీక్షా ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. శ్రామిక్ రైలులో మే 20న ముంబయి నుంచి హరిద్వార్ చేరుకున్న వలస కార్మికులను 15 జిల్లాలకు బస్సుల్లో తరలించామని, అల్మోరా, నైనిటాల్, బగేశ్వర్ జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి ప్రస్తుతం వైరస్ నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ‘శ్రామిక్ రైల్లో వచ్చిన వలస కార్మికులకు ఆదివారం పరీక్షలు నిర్వహించగా మరో 32 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది... దీంతో మొత్తం ఈ సంఖ్య 87కి చేరింది.. మరి కొందరి ఫలితాలు రావాల్సి ఉంది.. రాబోయే రోజుల్లో ఇవి పెరుగుతాయి’ అని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి యుగల్ కిశోర్ పంత్ తెలిపారు. అదే రైలులో ప్రయాణించి మరో 450 మంది నమూనాలను హరిద్వార్‌లో సేకరించినట్టు అక్కడ డీఎంసీ రవిశంకర్ తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మే 20 నుంచి 23 మధ్య దాదాపు 1,000 మంది నమూనాలను సేకరించగా.. రిషికేశ్‌‌లోని ఎయిమ్స్ వైద్యులు ఆదివారం మరిన్ని శాంపిల్స్‌ను సేకరించారు. ఈ విషయాన్ని ఎయిమ్స్-రిషికేశ్ పీఆర్ఓ రాకేశ్ థపిలియాల్ ధ్రువీకరించారు. తమ వద్ద ఇంకా 1,000 నమూనాల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. క కరోనా వైరస్ బాధితుల చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్ధారణ బాధితులు 10 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంటారని, ఒకవేళ ఏడు నుంచి 10 రోజుల్లోపు వైరస్ తీవ్రత ఎక్కువ కాకపోతే డిశ్చార్జ్ చేస్తామని వివరించారు.


By May 25, 2020 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/around-90-on-mumbai-to-haridwar-shramik-special-train-test-coronavirus-positive/articleshow/75961809.cms

No comments