Breaking News

లాక్‌డౌన్ 4.0: మాస్ ట్రాన్స్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్.. మెట్రో సైతం!


కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ మే 17 తర్వాత కూడా కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, నాలుగో దశలో మాత్రం మరింత సరళంగా లాక్‌డౌన్ అమలుచేయనున్నట్టు విస్పష్ట సంకేతాలు ఇచ్చారు. రెండో దశలో కొన్ని సడలింపులు ఇవ్వగా.. మూడో దశలో మరిన్ని ఆంక్షలు సడలించారు. రాబోయే విడతలో మరిన్ని ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా పలు విభాగాల్లో ఉత్పత్తి కార్యకలాపాలు, పరిమిత పరిధిలో మాస్ ట్రాన్స్‌పోర్ట్ ప్రారంభం అవుతాయి. కానీ, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌ల వర్గీకరణ ఆధారంగానే ఇవి కార్యకలాపాలకు అనుమతిస్తారు. ఈ విషయంలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండబోవు. జిల్లాలలో పాజిటివ్ కేసుల ఆధారంగా కంటెయిన్‌మెంట్ జోన్‌లు ప్రకటించడం కొనసాగుతుండగా, రోడ్ జోన్‌లలో నియంత్రణ లేని ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార కార్యకలాపాలు, కర్మాగారాలు, తయారీ యూనిట్లలో కార్యకలాపాలకు పరిమితంగా అనుమతిస్తారు. భౌతిక దూరం నిబంధనను అమలుచేస్తూ రోజువారీ కార్యకలాపాలపై పరిమితస్థాయి నియంత్రణలతో ఎక్కువ దుకాణాలు, మార్కెట్లు తెరవబడతాయి. రెడ్ జోన్‌లలో నిత్యవసర వస్తువుల కానివాటికి కూడా ఈ-కామర్స్ సంస్థలకు అనుమతులు ఇచ్చే సూచనలు ఉన్నాయి. రెడ్ జోన్‌లో ప్రజా రవాణాపై నిషేధం విధించడం వల్ల ప్రయివేట్ కార్యాలయాలు సహా ప్రభుత్వ విభాగాల్లో విధులకు హాజరవుతున్న 33 శాతం ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రజా రవాణాను ప్రారంభించే సూచనలు ఉన్నాయి. మెట్రో సర్వీసుల ప్రారంభానికి కూడా అనుమతించే అవకాశం ఉంది. ఢిల్లీ మెట్రో సర్వీసులు సురక్షితంగా పునఃప్రారంభించడానికి సీఐఎస్ఎఫ్ ఇప్పటికే ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ సిద్ధం చేసింది. ఇక, విమానయాన సేవలు కూడా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త మార్గదర్శకాలలో ప్రకారం రెడ్, ఆరెంజ్ జోన్‌లలో అనుమతించబడిన కార్యకలాపాల జాబితాతోపాటు నిరోధించే చర్యల జాబితా కూడా ఉండే అవకాశం ఉంది.. కాబట్టి, ప్రాథమికంగా, రెడ్, ఆరెంజ్ జోన్‌‌లలో నిషేధం కొనసాగితే, అన్ని కార్యకలాపాలు కంటెయిన్‌మెంట్ జోన్‌ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో తిరిగి ప్రారంభమవుతాయి’ అని ఓ అధికారి చెప్పారు. లాక్‌డౌన్ 4.0లో మాల్స్, బార్బర్, సెలూన్ సేవలు రెడ్ జోన్‌లలో తెరవడానికి అనుమతి ఇవ్వకపోవచ్చని అన్నారు.


By May 14, 2020 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-economic-activities-mass-transport-to-resume-on-limited-scale-in-lockdown-4-0/articleshow/75728593.cms

No comments