తమ్ముడితో అక్రమ సంబంధం... రూ.2లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్య
తమ్ముడి వరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అడ్డు చెబుతున్నాడని కట్టుకున్న భర్తనే చంపేసిన ఘటన జిల్లా పట్టణంలో వెలుగుచూసింది. పట్టణ శివార్లలోని మేడాపురం రైల్వే వంతెన వద్ద ఈనెల 4న జరిగిన నాగేంద్ర హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం ధర్మవరం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: ధర్మవరం పట్టణంలో నాగేంద్ర, నాగమణి దంపతులు నివాసముంటున్నారు. నాగమణికి మేడాపురం గ్రామానికి చెందిన వరుసకు తమ్ముడయ్యే మట్టా కేశవ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉంది. కేశవ తరుచూ ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగించేవాడు. ఈ విషయం నాగరాజుకు తెలియడంతో బంధువుల మధ్య పంచాయతీ పెట్టాడు. దీంతో పద్ధతి మార్చుకుని బుద్ధిగా ఉండాలని బంధువులు నాగమణికి హితవు పలికారు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా చంపేయాలని ఆమె కుట్ర పన్నింది. తన భర్తను చంపేందుకు నాగేంద్ర స్నేహితుడు దూదేకుల బాబుతో రూ.1.20 లక్షల నగదు, రెండు సెంట్ల భూమి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. బాబుతో సాయం చేసేందుకు వచ్చిన బ్రహ్మయ్యకు రూ.లక్ష ఇస్తానని చెప్పింది. Also Read: దీంతో ఈ నెల 4న మద్యం తాగుదామంటూ బాబు, బ్రహ్మయ్య కలిసి నాగేంద్రను ధర్మవరం శివార్లలోని మేడాపురం రైల్వే వంతెన వద్దకు తీసుకెళ్లారు. నాగేంద్రకు ఫుల్లుగా మద్యం తాగించడంతో అతడు మత్తులోకి జారుకున్నాడు. ఆ సమయంలో బ్రహ్మయ్య, బాబు బండరాయితో తలపై మోది చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు లోతుగా ధర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులు దూదేకుల బాబు, నాగమణి, మట్టా కేశవ, బ్రహ్మయ్యను శనివారం ప్యాదిండి అంజనేయస్వామి ఆలయం వద్ద అరెస్టు చేసి ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నలుగురికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. Also Read:
By May 10, 2020 at 08:32AM
No comments