Breaking News

మరిన్ని ప్రత్యేక రైళ్లు.. మే 15 నుంచి వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు జారీ


ఢిల్లీ సహా 15 ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోన్న విషయంం తెలిసిందే. ఈ రైళ్లకు పరిమితి సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌లు జారీచేస్తామని రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ఈ సదుపాయం మే 15 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రయాణికుల రైళ్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. క్రమంగా రైలు సర్వీసులను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. మే 22 నుంచి ప్రారంభమయ్యే ప్రయాణాలకు వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు జారీచేయనున్నారు. ‘వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు మే 15 నుంచి జారీచేస్తాం.. కానీ, చార్ట్ ప్రిపేర్ సమయానికి కన్ఫర్మ్ అయినవారికే ప్రయాణానికి అనుమతిస్తాం’ అని రైల్వే శాఖ వెల్లడించింది. రైలు టిక్కెట్ బుక్ చేసుకుని, స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉంటే వారిని అనుమతించమని, అతడి టిక్కెట్ ఛార్జీలను పూర్తిగా తిరిగి చెల్లిస్తామని తెలిపింది. కాగా, రైల్వే ప్రధాన కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రైల్ భవన్‌ను మూసివేసి, శానిటైజేషన్ చేపట్టారు. శుక్రవారం వరకు తెరవబోమని అధికారులు ప్రకటించారు. ప్రత్యేక రైళ్లలో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నవారిలో కొందరు చివరి నిమిషంలో ప్రయాణాలను రద్దుచేసుకోవడంతో వెయిట్ లిస్ట్ టిక్కెట్‌లు జారీచేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈ ప్రత్యేక రైళ్లు నిర్ణీత సమయంలో నడపాలని నిర్ణయించాం.. ఇందులో రిజర్వేషన్లు చేసుకున్న టిక్కెట్లు రద్దు ఉండదు.. వెయిట్‌లిస్ట్ టిక్కెట్లు స్లీపర్ క్లాస్‌కు గరిష్ఠంగా 200, ఏసీ చెయిర్ కార్, థర్డ్ ఏసీ 100, సెకెండ్ ఏసీ 50 వరకు బుక్ చేసుకోవచ్చు’ అని పేర్కొంది.


By May 14, 2020 at 08:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/railway-department-planning-more-special-trains-waitlisting-to-start-from-may-15/articleshow/75729480.cms

No comments