Breaking News

రూ. 150 కోసం స్నేహితుడి హత్య.. లాక్ డౌన్ వేళ ముంబయిలో దారుణం


మహారాష్ట్ర రాజధాని నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.150ల కోసం తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి స్నేహితుడి ప్రాణాలు తీశాడు. సౌత్ ముంబైలోని ఓ ప్రాంతంలో నివసించే భూషణ్ షేక్ అలియాస్ చుల్‌బుల్‌, రియాజ్‌ షేక్‌ స్నేహితులు. వీరిద్దరు భౌచా దక్కా చేపల మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కారణంగా పనిలేక కొద్దిరోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌కు ముందు రియాజ్ తన ఫ్రెండ్ దగ్గరి నుంచి రూ.150 అప్పుగా తీసుకున్నాడు. Also Read: గత శుక్రవారం చుల్‌బుల్ అతడి ఇంటికి వెళ్లి తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని అడిగాడు. అయితే చాలారోజులుగా పనిలేకపోవడంతో తన దగ్గర డబ్బులు లేవని, కొద్దిరోజుల తర్వాత ఇస్తానని రియాజ్ చెప్పాడు. శనివారం మరోసార అతడి ఇంటికి వెళ్లి చుల్‌బుల్ డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన చుల్‌బుక్ బండరాయితో రియాజ్‌ను తీవ్రంగా కొట్టి పరారయ్యాడు. Also Read: రక్తపు మడుగులో పడివున్న రియాజ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు చుల్‌బుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కేవలం రూ.150 కోసం హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నాళ్లు పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. Also Read:


By May 19, 2020 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lockdown-effect-mumbai-man-kills-friend-for-150-rupees/articleshow/75818850.cms

No comments