150 మిలియన్ల ‘బుట్టబొమ్మ’.. బన్నీకే సాధ్యమైన రికార్డ్
‘అల వైకుంఠపురములో’ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసింది. నిజానికి సినిమా కన్నా ముందే ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎస్.తమన్ స్వరపరిచిన పాటలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సామజవరగమన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే రాములో రాములా, బుట్టబొమ్మ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘అల వైకుంఠపురములో’ ఆడియో విడుదలైంది. ఆల్బమ్‌లోని లిరికల్, వీడియో సాంగ్స్‌ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. లిరికల్ వీడియోలకు ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వీడియో సాంగ్స్‌కు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ అసాధారణంగా దూసుకుపోతోంది. ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. ఈ మార్కును వేగంగా అందుకున్న సాంగ్ ఇది. అప్‌లోడ్ చేసిన సుమారు 2 నెలల కాలంలోనే 150 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు. Also Read: అయితే, అల్లు అర్జున్ సినిమాలోని ఒక వీడియో సాంగ్ 150 మిలియన్ వ్యూస్ సాధించడం ఇదే తొలిసారి కాదు. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని సీటీ మార్ వీడియో సాంగ్ సైతం 150 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది. అయితే, ఈ మార్క్‌ను అందుకోవడానికి సీటీ మార్ సాంగ్‌కు చాలా సమయం పట్టింది. 2017 ఆగస్టులో ఈ పాటను ఆదిత్య మ్యూజిక్ అప్‌లోడ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ పాట 150 మిలియన్ మార్క్‌ను అందుకుంది. టాలీవుడ్‌లో ఒకే హీరోకు చెందిన రెండు వీడియో పాటలు 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం ఇదే తొలిసారి. అయితే, 150 మిలియన్ వ్యూస్ సాధించిన టాలీవుడ్ వీడియో సాంగ్స్ మరికొన్ని ఉన్నాయి. ‘ఫిదా’లోని ‘వచ్చిండే’ వీడియో సాంగ్ 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. కాగా, ‘అల వైకుంఠపురములో’ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు.
By May 03, 2020 at 12:27PM
No comments